Begin typing your search above and press return to search.
తమిళనాడులో శ్రీరెడ్డి రాజకీయాలా?
By: Tupaki Desk | 17 Nov 2019 7:22 AM GMTవివాదాస్పద నటి శ్రీరెడ్డి తమిళ నటుడు ఉదయనిధి స్టాలిన్ పై ఆరోపణలు చేసినట్లు ఫేస్ బుక్ లో పోస్టులు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో కోలీవుడ్ సహా తమిళ రాజకీయవర్గాల్లోనూ అది హాట్ టాపిక్ గా మారింది. అయితే తాజాగా వాటిని శ్రీరెడ్డి ఖండించింది. అవన్నీ నకిలీ పోస్టులు అని.. తాను పెట్టిన పోస్టింగులు కాదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇప్పటివరకూ తాను ఉదయనిధిని చూడలేదని శనివారం చెన్నైలో ప్రసాద్ ల్యాబ్స్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపింది.
కరుణానిధి కుటుంబపై గౌరవం ఉంది. నా పేరుతో చాలా నకిలీ ఖాతాలున్నాయి. సైబర్ క్రైమ్ కి ఫిర్యాదు చేసాను. ఆ విషయాలు పోలీసులు చూసుకుంటారంటూనే ఓ షాకింగ్ ట్విస్ట్ ఇచ్చింది. త్వరలోనే తమిళనాడు రాజకీయాల్లో ప్రవేశించబోతున్నాను. ఇక్కడి ప్రజలకు సేవ చేస్తానని తెలిపింది.
వరుసగా తెలుగు-తమిళం స్టార్లపై వేధింపుల ఆరోపణలు చేసిన ఈ భామ రాజకీయాల్లోకి రావడమా? అక్కడ ఎవరిని ఉద్ధరించాలని..? అంటూ తన వ్యాఖ్యలు విన్న ఆమె అభిమానులే నవ్వుకోవడం విశేషం. నిన్ను ఏ పార్టీలో జాయిన్ చేసుకుంటారు అంటూ సోషల్ మీడియాల్లో కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. హీరో తనతో ఓ స్టార్ హోటల్లో రాత్రంతా గడిపారని సోషల్ మీడియాలో శ్రీరెడ్డి పేరుతో పోస్టింగులు వైరల్ అయిన సంగతి తెలిసిందే.