Begin typing your search above and press return to search.
ఆ నిర్మాతపై శ్రీరెడ్డి ఫిర్యాదు
By: Tupaki Desk | 29 July 2018 2:03 PM GMTకొన్ని నెలల పాటు హైదరాబాద్ వేదికగా టాలీవుడ్ కాస్టింగ్ కౌచ్ పై పోరాటం చేసిన శ్రీరెడ్డి.. కొన్ని రోజులుగా మకాం చెన్నైకి మార్చిన సంగతి తెలిసిందే. కోలీవుడ్ ప్రముఖులపై గత కొన్ని రోజుల్లో గట్టి ఆరోపణలు చేస్తోంది. దీనిపై కొందరు తీవ్ర స్థాయిలో స్పందించారు. వారాహి అనే దర్శక నిర్మాత శ్రీరెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. శ్రీరెడ్డిని వేశ్య అని కూడా అన్నాడతను. దీనిపై ఇప్పటికే తీవ్రంగా స్పందించిన శ్రీరెడ్డి.. వారాహిపై నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో పాటు వారాహి తనకు ఫోన్ చేసి బెదిరించాడంటూ చెన్నై పోలీసు కమిషనరేట్ లో శ్రీరెడ్డి ఫిర్యాదు అందజేసింది.
‘‘సినిమాల్లో అవకాశాలు ఇస్తానని నమ్మించి లైంగిక కోర్కెలు తీర్చుకుంటున్న వారి బండారాన్ని నేను బయటపెడుతున్నాను. అయితే గత 24వ తేదీన నటుడు - దర్శక - నిర్మాత వారాహి.. మీడియాలో సమావేశంలో వ్యభిచారిగా చిత్రీకరిస్తూ నా గురించి తప్పుగా మాట్లాడారు. అంతే కాక నాకు ఫోన్ చేసి బెదిరించారు. ఇది నన్ను తీవ్ర మనస్తాపానికి గురిచేసింది. వారాహిపై లైంగిక వేధింపుల చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను’’ అని శ్రీరెడ్డి ఫిర్యాదులో పేర్కొంది. మరోవైపు లైంగిక వేధింపుల గురించి నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్.. ప్రధాన కార్యదర్శి విశాల్.. కోశాధికారి కార్తిలకు ఫిర్యాదు చేయాలని ప్రయత్నించినా వాళ్లు తనను పట్టించుకోలేదని శ్రీరెడ్డి విమర్శించింది.