Begin typing your search above and press return to search.

వాళ్లందరిదీ తప్పే.. మరి శ్రీరెడ్డిది??

By:  Tupaki Desk   |   12 April 2018 5:59 AM GMT
వాళ్లందరిదీ తప్పే.. మరి శ్రీరెడ్డిది??
X
ప్రస్తుతం టాలీవుడ్ లో ఎలాంటి వాతావరణం ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సమ్మర్ లో సినిమాలు వస్తాయనుకుంటే సమస్యలు కనిపిస్తున్నాయి. ఎవరి తప్పు ఎవరిదీ ఒప్పు అనే విషయాల్లో క్లారిటీ రావడం కష్టంగానే ఉంది. అయితే మొదట అభిరామ్ ఫోటోలు లీక్ అవ్వగానే ఒక్కసారిగా శ్రీ రెడ్డి వివాదం తారా స్థాయికి చేరింది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు ఈ విషయం సంచలనానికి దారి తీస్తోంది.

అయితే ఎక్కువగా ప్రస్తుతం శ్రీ రెడ్డికే మద్దతు లభిస్తోంది. మహిళా సంఘాలు మీడియా చానెళ్లు శ్రీ రెడ్డిని మోసం చేశారు అని చెబుతున్నారు. అయితే కొందరు వేసే ప్రశ్నలు మాత్రం అందుకు కొంచెం పరోక్షంగా రెండు చేతులు కలిపితేనే సౌండ్ వస్తుంది అనే తరహాలో కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాకుండా కొన్ని ప్రశ్నలు కూడా వైరల్ అవుతున్నాయి. అసలు అభిరామ్ తో ఆమె అంత సన్నిహితంగా ఎందుకు ఉంది? ఆఫర్స్ ఇస్తా అంటే ప్రేమిస్తారా? అయినా అభిరామ్ సినిమా ఇండస్ట్రీలోకె రాలేదు. అంత ఈజీగా ఎలా నమ్మేస్తారు? అతను ఒక్క సినిమా కూడా చేయలేదు. పైగా అభిరామ్ చిన్న పిల్లల మనస్తత్వం అని.. అలాంటి వ్యక్తిని కేవలం ట్రాప్ చేయడానికి ఆమె ప్లాన్ వేసిందని ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి

ఇక కొన్ని మీడియా ప్రతినిధులు కూడా ఆమెను లైవ్ డిబేట్ లో ప్రశ్నించారు. వాట్సాప్ కాన్వర్సేషన్స్ పై స్పందిస్తూ.. అసలు శ్రీ రెడ్డి అలాంటి బ్యాడ్ కామెంట్స్ వచ్చినప్పుడు ఎందుకు స్టాప్ చేయమని చెప్పలేదు. అలానే ఎందుకు కంటిన్యూ చేసింది. అవకాశాల కోసం మరి ఇంతలా చేస్తారా? వాళ్లు చేసింది తప్పే మరి శ్రీ రెడ్డి చాట్ ను కొనసాగించడం ఎంతవరకు కరెక్ట్ అనే విధంగా మీడియా అధికారి ఇటీవల శ్రీ రెడ్డి లీక్స్ పై స్పందించారు.