Begin typing your search above and press return to search.
వర్మ వీడియోపై రియాక్ట్ కావా శ్రీరెడ్డి?
By: Tupaki Desk | 20 April 2018 3:13 AM GMTజనాలంతా ఎవరి మానాన వాళ్లు ఉన్న వేళ తెర మీదకు వచ్చింది శ్రీరెడ్డి. తాను చెప్పాలనుకున్న విషయాన్ని రకరకాలుగా చెప్పుకొచ్చింది. వినేందుకు ఉత్సాహం చూపించనోళ్లను సైతం ఆగి మరీ చూసేలా చేసింది. అంతేనా.. అప్పటివరకూ మాట్లాడని వారిని మాట్లాడించే ప్రయత్నం చేసింది. అందులో సక్సెస్ అయ్యింది.
అందరూ మాట్లాడటం మొదలు పట్టేసరికి తాను మౌనమైంది. తన మౌనంతో ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా ఉండిపోయింది. మీ ఇష్టం.. మీ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుకు చావండంటూ ఉండిపోయింది. అయితే.. అప్పుడప్పుడు బయట జరిగే పరిణామాల్ని గమనిస్తూ.. ఫేస్ బుక్ లో పోస్టులు పెట్టటం మొదలు పెట్టింది.
ఒక టీవీ ఛానల్ లైవ్ లో తెగ ఏడ్చేసి.. ఇక నావల్ల కాదు.. నేను పోరాడలేనంటూ దిగాలుగా మాట్లాడి.. ఇంటికి వెళ్లిన తర్వాత అంతే దిగాలుగా మెసేజ్ లు పెట్టిన శ్రీరెడ్డి.. కాసేపటికే పుంజుకుంది.
మళ్లీ ఎనర్జటిక్ గా మారింది. ఈసారి తన స్టైల్ కాస్త మార్చి మొదట సారీతో మొదలెట్టి.. చివరకు మీ ఇష్టం నన్ను తిట్టారా? మీ సంగతి నేను కాదు.. పోలీసులే చూసుకుంటారని తేల్చింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. తాను మౌనంగా ఉన్న నాటి నుంచి ఎన్నో అంశాలు తెర మీదకు వచ్చినా ఎక్కడా.. ఏ ఛానల్ ముందుకు రాకుండా ఉన్న ఆమె.. ఈ రోజు (శుక్రవారం) ఒక ఛానల్ ముందుకు రానున్నట్లు వెల్లడించారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. శ్రీరెడ్డి మెసేజ్ పరంపరలో ఒక విషయాన్ని ఆమె అస్సలు ప్రస్తావించకుండా ఉండటం కనిపిస్తుంది. పవన్ ను అలా తిట్టించింది తానేనని.. తాను ఇచ్చిన సలహాతోనే శ్రీరెడ్డి ప్రభావితమై.. తిట్టేసినట్లుగా చెప్పుకున్నారు. అంతేనా.. సురేశ్ బాబు ఫ్యామిలీతో రాజీకి ఓకే అంటే రూ.5కోట్లు ఇస్తానన్న మాటను వెల్లడించిన వర్మ వీడియోపై ఎలాంటి మెసేజ్ పెట్టకుండా ఉండటం.. మౌనం పాటించిన వైనం చూస్తే.. అక్కడేదో వ్యూహం ఉందేమో అన్న సందేహానికి గురి కాక మానదు. ఎందుకంటే.. టీవీ లైవుల్లోనూ..మిగిలిన మీడియంలలో వచ్చే వాటిపై వెంటనే స్పందిస్తున్న శ్రీరెడ్డి.. వర్మ వీడియో మెసేజ్ మీద మాత్రం ఎందుకు స్పందించనట్లు? అన్నది ప్రశ్నగా మారింది. దీనికి శ్రీరెడ్డి సమాధానం చెబుతారా?