Begin typing your search above and press return to search.
ఆ ప్రదర్శన చేశాకే `మా` స్పందించింది: శ్రీరెడ్డి
By: Tupaki Desk | 10 April 2018 8:46 AM GMTటాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ కు వ్యతిరేకంగా, తెలుగు నటీమణులకు మరిన్ని అవకాశాలు కల్పించాలని కోరుతూ నటి శ్రీరెడ్డి కొద్ది రోజులుగా చేస్తోన్న ఆందోళన తీవ్రరూపం దాల్చిన సంగతి తెలిసిందే. ముందుగా హెచ్చరించినట్లుగానే శ్రీరెడ్డి....ఫిల్మ్ చాంబర్ ముందు అర్ధనగ్న ప్రదర్శన చేయడం జాతీయ వ్యాప్తంగా సంచలనం రేపింది. దీంతో, అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన `మా`సభ్యులు శ్రీరెడ్డిపై చర్యలు తీసుకున్నారు. `మా` నిర్ణయం నేపథ్యంలో టాలీవుడ్ లో శ్రీరెడ్డికి అనుకూల, వ్యతిరేక వర్గాలు ఏర్పడ్డాయి. `మా` చర్యలు తీసుకున్నప్పటికీ శ్రీరెడ్డి ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. శ్రీరెడ్డిని `మా `బాయ్ కాట్ చేసిన మరుసటి రోజు ఓ టీవీ చానెల్ లైవ్ డిబేట్ లో పాల్గొన్న శ్రీరెడ్డి మరిన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను హఠాత్తుగా అర్ధనగ్న ప్రదర్శనకు దిగలేదని, నెల రోజులుగా పోరాడుతున్నా `మా` పట్టించుకోకపోవడంతోనే గత్యంతరం లేని పరిస్థితుల్లో అలా చేశానని చెప్పింది. తన సమస్యలపై నెల రోజులుగా స్పందించని `మా`సభ్యులు....ఆ ప్రదర్శన తర్వాత హఠాత్తుగా ప్రెస్ మీట్ పెట్టి తనను బాయ్ కాట్ చేశారని శ్రీరెడ్డి మండిపడింది. అర్ధనగ్న ప్రదర్శన చేసిన తర్వాతే `మా` స్పందించిందని, ఇన్నాళ్లూ ఎందుకు స్పందించలేదని శ్రీరెడ్డి ప్రశ్నించింది.
తేజా గారు తనకు రెండు సినిమాల్లో నటించే అవకాశం ఇచ్చారని, మొత్తం చేతిలో నాలుగు పెద్ద సినిమాలున్నాయని, ఒకవేళ తనకు పెద్ద సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చినా ఈ పోరాటం ఆపే ప్రసక్తే లేదని శ్రీరెడ్డి చెప్పింది. కెరీర్ ఆరంభంలో కొన్ని అవకాశాల కోసం తాను నానా తిప్పలు పడ్డానని, చాలా ఇబ్బందులకు గురయ్యానని చెప్పింది. అలా అని, తెలుగు చిత్ర పరిశ్రమలో అందరూ చెడ్డవారని తాను చెప్పడం లేదని తెలిపింది. అయితే, అవకాశాల కోసం వెళ్లినపుడు కొంతమంది తనతో పడుకోవాలని, అక్కడ ముద్దు పెట్టు...ఇక్కడ చుంబించు అని ఇబ్బంది పెట్టారని చెప్పింది. చిత్ర పరిశ్రమపై కోటి ఆశలతో వచ్చిన అమ్మాయిలను అవకాశాల పేరుతో వాడుకొని వదిలేసే వారిపైనే తన పోరాటం అని శ్రీరెడ్డి తెలిపింది. తాను చేస్తున్న పోరాటం ఆపాలని వందల కొద్దీ బెదిరింపు ఫోన్ కాల్స్, మెసేజ్ లు వస్తున్నాయని, ఆ తాటాకు చప్పుళ్లకు తాను భయపడననీ శ్రీరెడ్డి తేల్చి చెప్పింది. తన ఫోన్ నంబర్ కూడా మార్చనని శ్రీరెడ్డి తెలిపింది. తన పోరాటాన్ని జాతీయ స్థాయికి తీసుకువెళతానని శ్రీరెడ్డి స్పష్టం చేసింది.