Begin typing your search above and press return to search.

శ్రీ‌రెడ్డిని తిట్టే వారంతా పీకే ఫ్యాన్సేనా?

By:  Tupaki Desk   |   20 April 2018 3:09 AM GMT
శ్రీ‌రెడ్డిని తిట్టే వారంతా పీకే ఫ్యాన్సేనా?
X
వినేటోడు ఉంటే చెప్పేటోడు చెల‌రేగిపోతార‌ని ఊరికే అన‌లేదు. వింటున్నార‌నో.. చూస్తున్నార‌నో కానీ తొక్క‌లో లాజిక్కుల మీద లాజిక్కుల‌తో నెల రోజుల నుంచి న‌డుస్తోంది శ్రీ‌రెడ్డి వ్య‌వ‌హారం. సినిమాటిక్ మ‌లుపుల‌తో అంత‌కంత‌కూ నాట‌కీయంగా మారిన ఉదంతంలో శ్రీ‌రెడ్డి కోరుకున్న‌ట్లే సినీ పెద్దోళ్లంద‌రిని మైకుల ముందుకు వ‌చ్చేలా చేస్తోంది. ఈ విష‌యంలో శ్రీ‌రెడ్డిని అభినందించాల్సిందే.

క్యాస్టింగ్ కౌచ్ పేరుతో టాలీవుడ్ ఉద్ద‌ర‌ణ కోసం రంగంలోకి దిగిన శ్రీ‌రెడ్డి తాజాగా కొంద‌రు పెద్ద‌లు విష‌యాన్ని సైడ్ ట్రాక్ చేస్తున్న‌ట్లుగా త‌న ఫేస్ బుక్ వాల్ మీద మెసేజ్ పెట్టుకుంది. నిజంగానే అలాంటిది జ‌రుగుతుందా? అంటే లేద‌నే చెప్పాలి. నిజానికి సిత్ర‌మైన లాజిక్కుల‌తో కొత్త త‌ర‌హా వాద‌న‌ల్ని తెర మీద‌కు తెస్తున్న శ్రీ‌రెడ్డి మాట‌లు వింటుంటే మా సెడ్డ సిరాకు వ‌చ్చేసే ప‌రిస్థితి.

ఏంది? ఒక ఆడ‌కూతురు నోరు తెరిచి మాట్లాడుతుంటే సిరాకు వ‌చ్చేస్తుందా?.. నా ఫేస్ బుక్ మాత్ర‌మే కాదు.. నా గురించి రాసే రాత‌ల‌న్నింటి మీదా పోలీసుల నిఘా ఉంది. జాతీయ మాన‌వ‌హ‌క్కుల సంఘం ఉంది. అంత‌ర్జాతీయ మీడియా ఉంద‌ని శ్రీ‌రెడ్డి చెప్పేస్తారేమో.. ఆమెను త‌ప్పు ప‌ట్టాల‌నో.. ఆమెను అవ‌మానించాల‌న్న‌ది మా ఉద్దేశం ఎంత మాత్రం కాదు.

ఎందుకంటే.. మాన‌వ హ‌క్కుల‌న్నీ శ్రీ‌రెడ్డికి మాత్ర‌మే ఉంటాయ‌న్న‌ట్లుగా ఉంది వ్య‌వ‌హారం.

ఎందుకంటే.. శ్రీ‌రెడ్డికి ఎవ‌రు న‌చ్చితే వారిని తిట్టేయొచ్చు. అది కూడా ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా. వారికి మానవ హ‌క్కులు ఏమీ ఉండ‌వా? నోటికి వ‌చ్చేసిన‌ట్లు తిట్టేసిన త‌ర్వాత‌.. త‌ప్పుగా మాట్లాడిన‌ట్లుగా అనిపిస్తే సారీ చెప్పేస్తుంది. అంత‌టితో మాట అనిపించుకున్నోళ్లంతా అర్జెంట్ గా అంత‌కు మించిన తిట్ల‌ను అక్క‌డితో మర్చిపోవాలి. అమ్మ‌ల్ని తిట్టినా కూడా పెద్ద మ‌న‌సుతో క్ష‌మించాలి. ఎందుకంటే.. శ్రీ‌రెడ్డి క‌దా సారీ చెప్పింది. ఇదెక్క‌డి లాజిక్కో అర్థం కాదు. అంతేనా.. త‌న‌కు నోటికి వ‌చ్చిన‌ట్లు తిట్టేసిన‌ప్పుడు జాతీయ మాన‌వ‌హ‌క్కులు గుర్తుకు రావా? అన్న‌ది మ‌రో డౌట్‌.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. మ‌రో పెద్ద డౌట్ ఎంత‌కూ తీర‌ని ప‌రిస్థితి. శ్రీ‌రెడ్డి వ్య‌వహారాన్ని.. ఆమె తీరును స‌మ‌ర్థించే వారు ఎంద‌రో.. తిట్టే వారు అంత‌కంటే ఎక్కువ‌మంది ఉంటార‌న్న‌ది అంద‌రూ ఒప్పుకునే మాట‌.

ఇక్క‌డే మ‌రో చిక్కు ప్ర‌శ్న తెర మీద‌కు వ‌స్తుంది. అదేమంటే.. శ్రీ‌రెడ్డిని తిట్టేవారంతా ప‌వ‌న్ ఫ్యాన్స్ అన్న‌ట్లుగా శ్రీ‌రెడ్డి మాట‌లు ఉండ‌టం క‌నిపిస్తుంది. త‌న‌ను తిట్టే వారంతా.. ట్రోలింగ్ చేసే వారంతా ప‌వ‌న్ ఫ్యాన్స్ అంటూ ఒక కంక్లూజ‌న్ కు రావ‌టం ఏలా? అన్న‌ది ప్ర‌శ్న‌.

త‌న హ‌క్కుల గురించి త‌ర‌చూ మాట్లాడే శ్రీ‌రెడ్డి.. త‌న మాదిరే ప‌వ‌న్ కూడా మ‌నిషేన‌ని.. ఆయ‌న‌కు కూడా కొన్ని హ‌క్కులు ఏడ్చి ఉంటాయ‌ని మ‌ర్చిపోకూడ‌దు క‌దా? శ్రీ‌రెడ్డి తీరు న‌చ్చ‌క‌.. చేతిలో ఉన్న సెల్ ఫోన్ ప‌ట్టుకొని ఎడాపెడా మెసేజ్ పెట్టేస్తే.. అత‌గాడు ప‌వ‌న్ ఫ్యాన్ అంటూ ముద్ర ఎలా వేస్తారు? శ్రీ‌రెడ్డిని తిట్టినోళ్లంతా ప‌వ‌న్ ఫ్యాన్స్ అంటూ జ‌న‌ర‌లైజ్ చేయ‌టం ద్వారా ప‌వ‌న్ ను త‌ర‌చూ అవ‌మానించ‌టం కింద‌కు రాదా? త‌న పేరును రుజువు చేయ‌ని అంశానికి అదే ప‌నిగా జ‌త చేర్చ‌టం ఆయ‌న ఇమేజ్ ను ఎంత‌గా డ్యామేజ్ చేస్తుంది. దానికి బాధ్యులు ఎవ‌రు? త‌న‌ను తిట్టే వారిలో క‌నీసం ప‌ది మందిలో ఆరేడుగురిని ప‌వ‌న్ ఫ్యాన్స్ గా ఫ్రూవ్ చేసి.. ఆ త‌ర్వాత ప‌వ‌న్ ను త‌ప్పు ప‌డితే కాస్త‌న్నా అర్థం ఉంటుంది.

ముక్కు ముఖం తెలీనోళ్లు.. శ్రీ‌రెడ్డి చెప్పే లాజిక్కులు న‌చ్చ‌క‌.. ఆమె మాట‌లు ఏ మాత్రం స‌బ‌బుగా అనిపించ‌క త‌ప్పు ప‌డితే.. స‌ద‌రు వ్య‌క్తిని పీకే ఫ్యాన్ కింద డిక్లేర్ చేయ‌టం త‌ర్క‌బ‌ద్ధమేనా? అన్న‌ది డౌట్‌. అయినా ఇక్క‌డ లాజిక్కుల‌తో సంబంధం ఏముంది. ఆర్జీవీ లాంటోళ్లు జ‌నాల్ని పిచ్చోళ్ల‌ను చేస్తూ.. వారి భావోద్వేగాల‌తో త‌న తెలివితో ఎలా ఆడుకుంటాన‌న్న విష‌యాన్ని ఆర్జీవీనే స్వ‌యంగా వీడియోలో చెప్ప‌టం చూశాం. తిట్టిన ప్ర‌తి ఒక్క‌రిని ప‌వ‌న్ ఫ్యాన్ గా ముద్ర వేయ‌టం ద్వారా మ‌రింత పాపులార్టీని సొంతం చేసుకోవ‌చ్చ‌ని అనుకుంటున్నారా శ్రీ‌రెడ్డి? మీ మ‌న‌సులో ఏం అనుకుంటున్నారో చెప్పే హ‌క్కు లేదు కానీ.. చాలామంది మ‌దిలో మెదులుతున్న సందేహానికి మాత్రం స‌మాధానం చెప్పి పుణ్యం క‌ట్టుకోరు?