Begin typing your search above and press return to search.

నాకు నీ మద్దతు సరే - నీ భర్త ఏంటీ ఇలా?

By:  Tupaki Desk   |   29 Sep 2018 5:11 PM GMT
నాకు నీ మద్దతు సరే - నీ భర్త ఏంటీ ఇలా?
X
ఆమద్య టాలీవుడ్‌ మరియు కోలీవుడ్‌ ను శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు ఏ స్థాయిలో ఒక కుదుపు కుదిపేశాయో - ఇప్పుడు అంతకు రెట్టింపుగా బాలీవుడ్‌ లో కుదుపు మొదలైంది. మాజీ హీరోయిన్‌ తనుశ్రీ దత్తా గత కొన్ని రోజులుగా చేస్తున్న వ్యాఖ్యలు బాలీవుడ్‌ వర్గాల వారికి నిద్ర లేకుండా చేస్తున్నాయి. హిందీ హీరోయిన్స్‌ ఎదుర్కొంటున్న లైంగిక వేందింపులపై వరుసగా కామెంట్స్‌ చేస్తున్న తనుశ్రీకి అనూహ్యంగా మద్దతు లభిస్తోంది.

తనుశ్రీ దత్తాకు మద్దతు తెలుపుతున్న వారిలో స్టార్స్‌ కూడా చేరారు. హీరోయిన్స్‌ ప్రియాంక చోప్రా - ట్వింకిల్‌ ఖన్నా - ఫరాన్‌ అక్తర్‌ - స్వరా భాస్కర్‌ - సోనమ్‌ కపూర్‌ ఇలా పలువురు బాలీవుడ్‌ స్టార్స్‌ తనుశ్రీకి మద్దతుగా నిలుస్తున్నారు. తాము కూడా తనుశ్రీ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నామని - బాలీవుడ్‌ లో హీరోయిన్స్‌ పై లైంగిక వేదింపులు ఎక్కువగానే ఉంటున్నాయని వారు అంటున్నారు. తనకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పిన తనుశ్రీ దత్తా తాజాగా ట్వింకిల్‌ ఖన్నాపై మాత్రం షాకింగ్‌ వ్యాఖ్యలు చేసింది.

ట్వింకిల్‌ ఖన్నా గారు మీరు నాకు మద్దతుగా నిలిచినందుకు సంతోషంగా ఉంది. కాని మీ వారు అక్షయ్‌ కుమార్‌ ఇంకా కూడా నానా పటేకర్‌ తో సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఇలాంటి సమయంలో మీరు నాకు ఇచ్చే మద్దతులో నిజాయితి ఉందని నేను ఎలా అనుకోగలను అంటూ ప్రశ్నించింది. ఈ విషయంలో మాత్రం తనుశ్రీపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సాటి మహిళగా ట్వింకిల్‌ ఖన్నా మద్దతు తెలిపితే ఇలాగేనా మాట్లాడేది అంటూ కొందరు సోషల్‌ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.