Begin typing your search above and press return to search.
షాకింగ్: నడిరోడ్డుపై బట్టలిప్పేసిన శ్రీరెడ్డి!
By: Tupaki Desk | 7 April 2018 6:29 AM GMTకొన్ని రోజులుగా తెలుగు సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ గురించి తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పిస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో.. టీవీ ఛానెళ్లలో హల్ చల్ చేస్తున్న శ్రీరెడ్డి ఈ రోజు అందరినీ విస్మయానికి గురి చేసింది. కొన్ని రోజులుగా హెచ్చరిస్తున్నట్లే నడి రోడ్డుపై ఆమె బట్టలిప్పి కూర్చుంది. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) కార్యాలయం ముందు శ్రీరెడ్డి తన టాప్ విప్పేసి నిరసనకు దిగింది. చుడీదార్లో అక్కడికి వచ్చిన శ్రీరెడ్డి ముందుగా ఆ డ్రెస్ విప్పేసింది. తర్వాత టాప్ తీసేసి.. కేవలం షార్ట్ తో రోడ్డుపై అందరూ చూస్తుండగా కూర్చుని ఒక టీవీ ఛానెల్ కు ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది.
కొన్ని రోజుల కిందట ఒక టీవీ ఛానెల్ చర్చలో మాట్లాడుతూ.. తనకు సినీ పరిశ్రమ పెద్దలు న్యాయం చేయని పక్షంలో హైదరబాద్ లో నడి రోడ్డు మీద బట్టలు విప్పి నిలబడతానని శ్రీరెడ్డి హెచ్చరించింది. ఆ సందర్భంగా క్యారెక్టర్ ఆర్టిస్టు కళ్యాణి కోపంతో ఆమెపై చేయి కూడా చేసుకుంది. ఐతే టీవీ ఛానెల్ చర్చలో ఏదో ఆవేశానికి గురై శ్రీరెడ్డి ఇలా మాట్లాడిందిలే అనుకున్నారు కానీ.. ఆమె నిజంగా ఇంత పని చేస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. సినిమాల్లో అవకాశాలు ఇస్తామంటూ సినీ పరిశ్రమకు చెందిన అనేక మంది తనతో లైంగిక వాంఛలు తీర్చుకున్నారని.. ఆ తర్వాత మోసం చేశారని శ్రీరెడ్డి ఆరోపిస్తోంది. అనేకమంది ప్రముఖుల బాగోతాలకు సంబంధించి తన దగ్గర ఆధారాలు ఉన్నట్లు కూడా ఆమె చెబుతోంది.
తాను నిరసన తెలిపే సమాచారాన్ని ఒక ఛానల్ ప్రతినిధులకు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఆమె నిరసన సమాచారం తెలుసుకున్న బంజారాహిల్స్ పోలీసులు ఉరుకులు పరుగుల మీద ఫిలింఛాంబర్ వద్దకు చేరుకున్నారు. ఆమెను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం ఆమె నివాసం ఉంటున్న ఇంటి వద్దకు తీసుకెళ్లి వదిలారు.
పోలీసులు అదుపులోకి తీసుకోవటానికి ముందు మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆమె.. మిగిలిన నటీమణులందరికి ఒక సినిమా తీస్తే మా సభ్యత్వం కార్డు ఇస్తారని.. తాను మూడు సినిమాలు చేసినా తనకు గుర్తింపు కార్డు ఇవ్వలేదన్నారు. సభ్యత్వం కార్డు ఇవ్వనందుకు ఊహించనిరీతిలో నిరసన తెలిపిన ఆమె.. ఇప్పటికి తనకు కార్డు ఇవ్వని పక్షంలో.. మరికొద్ది రోజుల్లో ఎవరూ ఊహించని పని చేస్తానని ఆమె హెచ్చరించారు. శ్రీరెడ్డి వ్యవహారం ఎక్కడి వరకూ వెళుతుందన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.