Begin typing your search above and press return to search.

చైసామ్ కు అభిమానుల తరపున శ్రీరెడ్డి విజ్ఞప్తి

By:  Tupaki Desk   |   29 Sep 2021 8:30 AM GMT
చైసామ్ కు అభిమానుల తరపున శ్రీరెడ్డి విజ్ఞప్తి
X
ఈమద్య కాలంలో నాగచైతన్య మరియు సమంతలు విడి విడిగా ఉంటున్నారు.. ఇద్దరి మద్య విభేదాలు ఉన్నాయి.. పెద్దలు వాటిని పరిష్కరించి మళ్లీ ఇద్దరిని ఏకం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఇద్దరిలో ఏ ఒక్కరు కూడా ఈ విషయం గురించి స్పందించలేదు. బయటి వారు మాత్రమే ఈ విషయాల గురించి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. కుటుంబ సభ్యుల నుండి కూడా ఇప్పటి వరకు ఎలాంటి అప్‌ డేట్ లేదు. దాంతో అసలు ఏం జరుగుతుంది అంటూ అంతా ఆసక్తిగా చూస్తున్న సమయంలో శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఆమె మాటలను బట్టి చూస్తు ఇద్దరు కూడా విడి విడిగా ఉంటున్నారు అనిపిస్తుంది. ఆమె ఇద్దరి మద్య ఉన్న గొడవలను సర్దుబాటు చేసుకుని మళ్లీ కలిసి పోవాలని విజ్ఞప్తి చేసింది.

శ్రీరెడ్డి మాట్లాడుతూ.. పెళ్లి అయిన తర్వాత సమంత డ్రస్సింగ్ విషయంలో తప్పుబట్టింది. ఎంత స్టార్‌ అయినా సెలబ్రెటీ అయినా కూడా మనం ఇండియన్‌ సాంప్రదాయంను పాటించాల్సిందే. అలా పాటించినప్పుడు మాత్రమే అంతా సాఫీగా సాగుతుంది. సంసారం అన్నప్పుడు చిన్న చిన్న గొడవలు వస్తూనే ఉంటాయి. వాటన్నింటిని పరిష్కరించుకుని కొన్ని విషయాల్లో రాజీ పడుతూ ఉండాలని సూచించింది. తమిళనాడులో మాత్రం తన ఫ్రెండ్‌ సర్కిల్‌ ఇంకా కొందరు మాట్లాడుకుంటూ అంత పెద్ద కుటుంబంకు చెందిన అబ్బాయిని పెళ్లి చేసుకున్న సమంత అతడి నుండి దూరంగా రావడం అనేది అవివేకం అవుతుందని అంటున్నారు. ఈ మాటలు నేను అంటున్నవి కాదు.. తమిళనాడులో చాలా మంది ఇలా మాట్లాడుకుంటున్నారు అంటూ చెప్పుకొచ్చింది.

సమంత కాని నాగ చైతన్య అన్నయ్య కాని ఇద్దరు కూడా వారి సంసారంను చక్క బెట్టుకునేందుకు ఒకరు కాకుంటే ఒకరు అయిన కాస్త తగ్గాలని విజ్ఞప్తి చేసింది. ఇద్దరు కూడా చాలా మందికి ఆదర్శంగా ఉన్నారు. చాలా బ్యూటీఫుల్‌ కపుల్‌ గా పేరు దక్కించుకున్నారు. అలాంటి మీరు విడి పోతే చాలా మంది బాధ పడుతారు. మీరు ఎంతో మందికి ఆదర్శంగా ఉండాల్సింది పోయి మీరు ఇలా చేయడం ఏమాత్రం బాగా లేదు అంది. సమంత వదిన నువ్వు సంసారాన్ని చక్క బెట్టుకో.. కావాలంటే మోడలింగ్‌.. సినిమాలు ఏమైనా ఒక హద్దు వరకు చేసుకో అంటూ శ్రీరెడ్డి సూచించింది. సహజంగా అయితే శ్రీరెడ్డిని ప్రతి విషయంలో నెటిజన్స్ తిట్టడం ట్రోల్స్ చేయడం చేస్తారు. కాని సామ్‌ మరియు చైతూల గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు మాట్లాడిన మాటలు నిజంగా కదిలించేవిగా ఉన్నాయి. ప్రతి ఒక్క అభిమాని తరపున శ్రీరెడ్డి మాట్లాడినట్లుగా ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. శ్రీరెడ్డి అన్నట్లుగా అభిమానులు కోరుకున్నట్లుగా అందరు ఆశిస్తున్నట్లుగా సమంత మరియు నాగచైతన్యలు మళ్లీ కలవాలి... వారిని కుటుంబ పెద్దలు కలిపేందుకు ముందుకు రావాలి.