Begin typing your search above and press return to search.
కేసీఆర్ నన్ను హీరోయిన్ చేశారు
By: Tupaki Desk | 18 April 2019 9:38 AM GMTనాడు శ్రీరెడ్డి గొంతెత్తింది.. మా అసోసియేషన్ ముందు అర్ధనగ్న ప్రదర్శన చేసింది. అప్పుడు ఆమెను ఎవరూ పట్టించుకోలేదు. తెలంగాణ ప్రభుత్వం చూసి చూడనట్లు వదిలేసింది. తప్పు ఎవరిదైనా దానికొక పరిష్కార మార్గం మాత్రం ఇప్పటికీ దక్కలేదన్న అసంతృప్తి ఇండస్ట్రీలోని మహిళల్లో ఉంది.
దాన్ని చెరిపేస్తూ తాజాగా తెలంగాణ ప్రభుత్వం టాలీవుడ్ లో లైంగిక వేధింపులపై ప్రత్యేక ప్యానెల్ ఏర్పాటు చేసింది. జీవోను కూడా జారీ చేసింది. దీంతో ఇది తన పోరాటానికి దక్కిన గౌరవంగా శ్రీరెడ్డి భావించి కేసీఆర్ కు తాజాగా కృతజ్ఞతలు తెలిపారు.
టాలీవుడ్ లో లైంగిక వేధింపులపై సీఎం కేసీఆర్ ప్యానెల్ ఏర్పాటు చేసినందుకు శ్రీరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ‘నా కల నిజమైంది. ఒక హైదరాబాద్ స్త్రీగా నేను చాలా గర్వపడుతున్నా.. ఈ ప్రపంచానికి నన్ను హీరోయిన్ ను కేసీఆర్ చేశారు. ఏడాదిలోపే అద్భుత ఫలితం ఇచ్చారు. ఉద్యమానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు.’ అంటూ సోషల్ మీడియాలో కేసీఆర్ కు, సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపింది శ్రీరెడ్డి.
కాగా ప్యానెల్ లో తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మోహన్ రావు - నిర్మాత - దర్శకులు తమ్మారెడ్డి - దర్శకనిర్మాత సుధాకర్ కూడా సభ్యులు. మహిళలు సమస్యలపై ఈ ప్యానెల్ ఎదుట ఇక నిర్భయంగా సమస్యలు చెప్పుకోవచ్చు. వాళ్లు కఠిన చర్యలు తీసుకుంటారు.