Begin typing your search above and press return to search.

ఓ ఆడదానిలా మాట్లాడు.. ఆమెపై శ్రీరెడ్డి సీరియస్‌

By:  Tupaki Desk   |   12 Sep 2020 5:30 PM GMT
ఓ ఆడదానిలా మాట్లాడు.. ఆమెపై శ్రీరెడ్డి సీరియస్‌
X
ఈమద్య కాలంలో సోషల్‌ మీడియాలో మాధవి లత బాగా ఫేమస్‌ అయ్యింది. హీరోయిన్‌ గా చేసిన సమయంలో ఆమెకు పెద్దగా స్టార్‌ డం రాలేదు. కాని ఆమెకు ఇప్పుడు బీజేపీలో ఉన్న కారణంగా మరియు సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌ గా పోస్ట్‌ చేసిన కారణంగా ఫాలోయింగ్‌ పెరిగింది. ఆమె గురించి జనాలు చర్చించుకోవడం కామన్‌ గా జరుగుతోంది. పవన్‌ కళ్యాణ్‌ పై అభిమానంతో ఆమె రెగ్యులర్‌ గా పోస్ట్‌ లు పెడుతూ ఉంటుంది. అయితే తాజాగా బర్త్‌ డే శుభాకాంక్షలు చెప్పిన అందరికి సమాధానం ఇచ్చిన పవన్‌ కళ్యాణ్‌ ఆమెకు మాత్రం రెస్పాండ్‌ అవ్వలేదు. దాంతో హర్ట్‌ అయిన మాధవిలత అందుకు సంబధించి పవన్‌ ను సున్నితంగా ట్రోల్‌ చేస్తూ పోస్ట్‌ పెట్టింది.

ఆమె పోస్ట్‌ కు పవన్‌ కళ్యాణ్‌ కాస్త సీరియస్‌ గా రియాక్ట్‌ అయ్యారు. పవన్‌ కళ్యాణ్‌ గారిని ట్రోల్‌ చేయడం అందరికి బాగా అలవాటు అయ్యింది. మీరు మరో శ్రీరెడ్డిలా మారవద్దు అంటూ కొందరు పవన్‌ అభిమానులు ఆమెను సున్నితంగా విమర్శించారు. తనను శ్రీరెడ్డితో పోల్చడంపై మాధవిలత సీరియస్‌ అయ్యింది. చీప్‌ వ్యక్తులతో నాకు పోలిక ఏంటీ. అలాంటి వ్యక్తులతో నాకు కంపారిజన్స్‌ పెట్టడం మానేయండి. నేనేమి మేకను.. గొర్రెను కాదు పులిని అంటూ ఆ కామెంట్స్‌ కు సమాధానం ఇచ్చింది. మాధవిలత సమాధానంకు శ్రీ రెడ్డి సీరియస్‌ అయ్యింది.

మాధవిలత ఓ ఆడదానిలా మాట్లాడు. మీరు పులితో అయినా పందితో అయినా పోల్చుకోండి నాకు అనవసరం. నీ ఫేస్‌ బుక్‌ లో నా గురించి ఏదైనా కామెంట్‌ వస్తే స్పందించకు. నాకు బీజేపీ అంటే ఇష్టం కనుక ఈసారికి నిన్ను వదిలేస్తున్నాను. నువ్వు ఏదో పెద్ద నాయకురాలివి అంటూ ఫీల్‌ అవ్వకు. సమాజంలో ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయి. వాటిని గురించి మాట్లాడకుండా చెత్త కవితలు రాయడం ఏంటీ. ఇంకోసారి నా గురించి ఏదైనా మాట్లాడావో బిడ్డా నీకు ఇంకోలా సమాధానం ఉంటుంది అంటూ శ్రీ రెడ్డి సీరియస్‌ అయ్యింది. మరి శ్రీ రెడ్డికి మాధవిలత ఎలా సమాధానం చెప్పబోతుందో చూడాలి.