Begin typing your search above and press return to search.
చెప్పుదెబ్బలు తప్పవు..ఇండస్ట్రీకి శ్రీరెడ్డి హెచ్చరిక
By: Tupaki Desk | 8 May 2018 4:21 PM GMTకొంచెం గ్యాప్ తర్వాత శ్రీరెడ్డి మళ్లీ గట్టిగా గళం వినిపిస్తోంది. తెలుగు సినీ పరిశ్రమ పెద్దల్ని ఉద్దేశించి ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇండస్ట్రీలో జనాలు మారకుంటే చెప్పుదెబ్బలు తప్పవంటూ ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తనను ఎంత బెదిరించినా తగ్గేది లేదని ఆమె అంది. సినీ ప్రముఖుల్ని కోర్టు బోనులు ఎక్కిస్తామని అంది.
‘‘వీలైనంత తొందరగా తీసుకురాకపోతే నా చెప్పు దెబ్బలకు రెడీ అవ్వండి. మీ పిచ్చి కుక్కల స్వైర విహారానికి బోనులు తయారు చేస్తున్నాం. మిమ్మల్ని కూడా కోర్టు బోనులు ఎక్కిస్తాం. మీరు, మీ కొడుకులు నల్ల డబ్బుతో చేసే అకృత్యాలకు చరమగీతం పాడుతాం. స్టూడియోల మీద ఎంత సంపాదిస్తున్నారో.. డిస్ట్రిబ్యూషన్ మీద మీ పెత్తనాలు.. యూఎఫ్ ఓ - క్యూబ్ పేరుతో రక్తం పీల్చే జలగల్లాగా చిన్న ప్రొడ్యూసర్స్ - డైరెక్టర్స్ - చిన్న హీరో నుండి ఆర్టిస్టుల పాలిట దరిద్రంలా ఎలా దాపురించారో అందరికీ తెలియజెబుతాం. మీరు ఎన్ని బెదిరింపులు.. సెటిల్మెంట్లు చేసినా.. ఎన్ని ప్లాన్లు వేసినా నేను వినను. 85 ఏళ్ల ఈ ఇండస్ట్రీకి స్వాతంత్ర్యం ఇప్పించడంలో మేమందరం ప్రాణాలకు తెగించి పోరాడతాం. ఈ ఉద్యమంలో ఈ సంఘానికి సంబంధించిన నేతలైన శ్రీరెడ్డి పేరుతో చేసే వసూళ్లకు మేం బాధ్యులం కాదు’’ అని శ్రీరెడ్డి పేర్కొంది.
స్థానికులకు ఛాన్సులివ్వకపోవడంపైనా శ్రీరెడ్డి గళం విప్పింది. ‘‘షూటింగ్స్ ఎలా చేస్తారో చూస్తాం. లోకల్ గా ఉన్న వారికి తిండి పెట్టకుండా బయట రాష్ట్రాల వారికి పరమాన్నం ఎలా ఎడతారో చూస్తాం. మీ బ్లాక్ మనీ ఎక్కడ దాస్తున్నారో - ప్రభుత్వం నోరు - మీడియా నోరు మీరు ఎలా నొక్కాలని ప్రయత్నిస్తున్నారో ప్రపంచానికి చాటుతాం. మీ కంటితుడుపు చర్యలకు సిద్ధంగా లేము. మీ కొడుకులు - మీ మనుమలు మా అందరి రాజ్యాన్ని ఎలా ఏలుతున్నారో - ఎలా అందరి డబ్బు కొల్లగొడుతున్నారో అందరికీ తెలిసేలా చేసాం’’ అని ఆమె అంది.