Begin typing your search above and press return to search.

ఇక పేర్లు బయటపెట్టనున్న శ్రీరెడ్డి

By:  Tupaki Desk   |   2 April 2018 5:30 PM GMT
ఇక పేర్లు బయటపెట్టనున్న శ్రీరెడ్డి
X
తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో జ‌రుగుతున్న కాస్టింగ్ కౌచ్ గురించీ... తెలుగు అమ్మాయిల‌కు జ‌రుగుతున్న అన్యాయం గురించి బ‌య‌ట‌పెట్టి... ఒక్క‌సారిగా సోష‌ల్ మీడియాలో పిచ్చ పాపుల‌రిటీ సొంతం చేసుకుంది శ్రీ‌రెడ్డి. త‌న ద‌గ్గ‌రున్న వీడియోల ద్వారా కొంద‌రి పేర్ల‌ను కూడా బ‌య‌ట‌పెట్టిన శ్రీ‌రెడ్డి ఎక్క‌డా టాలీవుడ్ పెద్ద‌ల‌... ప్ర‌ముఖుల పేర్లు మాత్రం చెప్ప‌లేదు... అయితే ఇప్పుడు స‌స్పెన్స్ కు తెర‌దించుతూ అంద‌రి పేర్లు చెప్పేయ‌బోతున్నానంటూ పెద్ద బాంబే పేల్చింది.

కొన్నాళ్లుగా త‌న ద‌గ్గ‌ర టాలీవుడ్ పెద్ద‌ల బాగోతాన్ని బ‌య‌ట‌పెట్టే వీడియోలు ఉన్నాయంటూ చెప్పుకుంటూ వ‌చ్చిన శ్రీ‌రెడ్డి... వాటిని మీడియాకు బ‌ట్ట‌బ‌య‌లు మాత్రం చేయ‌లేదు. అందుకే కొన్ని ఛానెళ్లు కూడా స‌రైన సాక్ష్యాధారాలు లేనిదే... ఎవ‌రి పేరు బ‌య‌టికి చెప్ప‌కుండా ర‌హ‌స్యం మెయింటెయిన్ చేశారు. దాంతో శ్రీ‌రెడ్డికి ఫేస్ బుక్‌ లో నెటిజ‌నుల నుంచి అనేక ర‌కాల కామెంట్లు వినిపిస్తున్నాయి. తాజాగా ‘అంద‌రి పేర్లూ చెబుతా అని చెప్పి - వారి పేర్లు చెబితే బీప్ సౌండ్ వేయ‌మ‌ని ఎందుకు చెప్పావ్‌... నిన్నెవ‌రు బెదిరించారు? అయినా నువ్వెవ‌రికీ భ‌య‌ప‌డ‌వు క‌దా!’ అంటూ నిల‌దీశాడో నెటిజ‌నుడు. దాంతో స‌ద‌రు ఛానెళ్ అభ్యంత‌రం వ‌ల్లే టాలీవుడ్ ప్ర‌ముఖుల పేర్లు చెప్పినప్పుడు బీప్ సౌండ్ వేయ‌మ‌న్నానని... ఇప్పుడు ఏబీఎన్ ఛానెల్లో అంద‌రి పేర్లు బ‌య‌ట‌పెట్ట‌బోతున్నానంటూ స‌మాధానం ఇచ్చింది శ్రీ‌రెడ్డి.

దీంతో టాలీవుడ్‌లో క‌ల‌క‌లం మొద‌లైంది. ఇప్ప‌టికే చెప్పీ... చెప్ప‌కుండా చేస్తున్న కొన్ని పోస్టుల కార‌ణంగా టాలీవుడ్‌ లో క్లాస్ డైరెక్ట‌ర్‌ గా పేరొందిన ద‌ర్శ‌కుడి ఇమేజ్ నాశ‌న‌మైంది. ఇప్పుడు ఈ ఛానెల్ ద్వారా మ‌రెంద‌రి పేర్లు రాబోతున్నాయోన‌ని తెలుగు ప్ర‌జ‌లంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఒక‌వేళ నిజంగా శ్రీ‌రెడ్డి ప్ర‌ముఖుల పేర్లు ఓపెన్‌ గా చెప్పేస్తే మాత్రం డ్ర‌గ్స్ స్కాండెల్ త‌ర్వాత మ‌రోసారి టాలీవుడ్‌ లో క‌ల‌క‌లం సృష్టించ‌డం ప‌క్కా.