Begin typing your search above and press return to search.
రాజమౌళి గారు మా సినిమాకు మార్పులు చెప్పారు
By: Tupaki Desk | 22 Sep 2022 6:21 AM GMTటాలీవుడ్ జక్కన్న రాజమౌళి పేరు వాడితే చాలు ఏ సినిమాకైనా కావాల్సినంత పబ్లిసిటీ దక్కుతుంది. ఆయన ఏదైనా సినిమా గురించి చిన్న మాట పాజిటివ్ గా మాట్లాడినా కూడా ఒక్కసారిగా ఆ సినిమా పై బజ్ క్రియేట్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటిది ఒక సినిమాకు మార్పులు చేర్పులు చెప్పాడు అంటే సినిమా గురించిన ఆసక్తి మరింతగా పెరుగుతుంది అనడంలో సందేహం లేదు.
తాజాగా దొంగలున్నారు జాగ్రత్త అనే సినిమాను చూసిన రాజమౌళి కొన్ని మార్పులు చేర్పులు చెప్పాడట. చిత్ర యూనిట్ సభ్యులు ఆయన చెప్పిన మార్పులకు తగ్గట్లుగా సినిమా సన్నివేశాల్లో మార్పులు చేశారట. ఈ విషయం ను స్వయంగా దొంగలున్నారు జాగ్రత్త సినిమా హీరో శ్రీ సింహా తెలియజేశాడు.
రాజమౌళి కుటుంబానికి చెందిన హీరో శ్రీ సింహా నటించిన సినిమా అనగానే దొంగలున్నారు జాగ్రత్త పై కాస్త ఇంట్రెస్ట్ అయితే జనాల్లో ఉంటుంది. ఇప్పుడు ఆయన రాజమౌళి గారు సినిమాను చూసి మాకు సలహాలు ఇచ్చారంటూ చెప్పడంతో మరింతగా సినిమా పై బజ్ క్రియేట్ అవుతుంది అనడంలో సందేహం లేదు.
సినిమా పూర్తయిన తర్వాత మాత్రమే మా కుటుంబ సభ్యులకు చెప్పాను. సినిమా షో ను మా వాళ్లకు ఇటీవల వేసాము. అందరికి కూడా బాగా నచ్చింది. ముఖ్యంగా రాజమౌళి గారికి సినిమా నచ్చింది. మమ్ములను ప్రశంసించారు. అయితే సినిమాలో ఆయన మార్క్ అన్నట్లుగా కొన్ని మార్పులు చెప్పాడని శ్రీ సింహా చెప్పుకొచ్చాడు.
ఇక ఈ సినిమా సర్వైవల్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో రూపొందినట్లుగా ఆయన పేర్కొన్నాడు. ఇలాంటి కాన్సెప్ట్ లు ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ పై రాలేదని.. హాలీవుడ్ లో చాలా సినిమాలు వచ్చాయని.. తెలుగు లో మొదటి సారి ఈ కాన్సెప్ట్ తో సినిమా చేయడం చాలా సంతోషంగా ఉందంటూ హీరో శ్రీ సింహా వ్యాఖ్యలు చేశాడు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.