Begin typing your search above and press return to search.
చంద్రబాబుకు జిరాక్స్ అన్నారు! -శ్రీతేజ్
By: Tupaki Desk | 14 April 2019 1:30 AM GMTవరుసగా బయోపిక్ లలో నటించినంత మాత్రాన బయోపిక్ స్టార్ అయినట్టా? అంటే కానేకాదని అంటున్నారు నటుడు శ్రీతేజ్. ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు లో వైయస్సార్ పాత్రలో కనిపించినప్పుడు అచ్చం వైయస్సార్ లా ఒదిగిపోయారు ఈ నవతరం స్టార్. ఇటీవలే రిలీజై చక్కని విజయం అందుకున్న ఆర్జీవీ లక్ష్మీస్ ఎన్టీఆర్ లోనూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్రలో నటించి మైమరిపించాడు. అచ్చం ఈయనే చంద్రబాబా? అన్నంతగా పాత్రలో ఒదిగిపోయి అద్భుత ఆహార్య ంతో ఆకట్టుకున్నారు. ఆ చూపు... రూపు.. నడక.. నడత.. ముఖ కవలికలు ప్రతిదీ అచ్చు గుద్దేశాడు ఈ కుర్రాడు! అంటూ కాంప్లిమెంట్లు వెల్లువెత్తాయి. అసలు ఈ అవకాశం ఎలా వచ్చింది? అంటే చాలా సంగతులే చెప్పాడు శ్రీతేజ్.
సీఎం చంద్రబాబు లా అచ్చు గుద్దేశావు.. ఆ పాత్రను బాగా స్టడీ చేశారా? అని ప్రశ్నిస్తే.. పరిశోధన అంటే ఫొటో కలెక్షన్స్ ఎక్కువగా చేశాను. రిఫరెన్స్ చాలా తక్కువగా ఉన్నాయి. 89 టైంలో ఉన్న ఫొటోలు చాలా తక్కువగా ఉన్నాయి. వీడియోలు చూశాను. బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది? ఆయన నడక, నడత, తీరుతెన్నులు పరిశీలించాను. ఎలా కూర్చుంటారు అన్నది గమనించాను. ఫింగర్ మూమెంట్స్ ఎలా ఉన్నాయి. ఎలా చూసి మాట్లాడారు. ఇవన్నీ ఫొటో కలెక్షన్స్ ఎక్కువగా చేశాను. తర్వాత దొరికిన వీడియోస్‌ని చూడడం. పాత వీడియోలు, కాంటెపరరీ వీడియోలు అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఆ టైంలో ఎలా ఉండి ఉండొచ్చు అనేది ఊహించుకుని దాని ప్రకారం చేశాను.. అని తెలిపాడు. ఆర్జీవీ ఏవైనా ఇన్‌పుట్స్ ఇచ్చారా? అని అడిగేస్తే.. స్క్రిప్ట్ పూర్తవ్వగానే నన్ను పిలిపించారు. ఏం చేశావు ఎలా ఫాలో అయ్యావ్ అని అడిగారు. దాన్ని బట్టి నేను చెప్పాను. ఫొటో కలెక్షన్ తో పాటు వీడియోలు చూశానని చెప్పాను. ఆయన బహిరంగ సభలను చూసి ఉంటావు కానీ, ఇంట్లో ఆయన ఎలా ఉంటారు ఏంటి అన్నది తెలియదు కదా అన్నారు. నాలో ఫస్ట్ రెయిజ్ అయిన ప్రశ్న ఇది. వెంటనే స్క్రిప్ట్ తీసుకుని నా సీన్స్ అన్నీ ఒన్ బై ఒన్ రాసుకుని ప్రాక్టీస్ చేసి ఒకసారి సార్‌కి పంపాను. అయన వెంటనే ఓకే అన్నారు అని తెలిపారు.
ఈ సినిమాకి మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏవి? అని ప్రశ్నిస్తే.. బయోపిక్ స్టార్ .. ఫ్రైడేస్టార్ .. మ్యాన్ ఆఫ్ ద డే శ్రీతేజ్ అని కాంప్లిమెంట్స్ ఇచ్చారు. సినిమాలో ఎన్ని పాత్రలు ఉన్నా కేవలం నిన్ను చూడడం కోసమే సినిమాకి వెళుతున్నాము అన్నవారు కూడా ఉన్నారని ఆనందం వ్యక్తం చేశారు. ఆర్జీవీ నన్ను తెరపై చూసి వన్ మ్యాన్ షో అని ప్రశంసించారు. ఆర్జీవీతో వర్క్ అంటే ఫెంటాస్టిక్. వంగవీటి నుంచి నేను ఆయనతో జర్నీ చేస్తున్నాను. అప్పటి నుంచి కూడా నామీద మంచి అభిప్రాయం ఉంది. హార్డ్‌వర్క్ చేస్తారు అనే నమ్మకం ఉంది. వంగవీటి టైంలో కూడా నన్ను ఆడిషన్ చెయ్యకుండానే జస్ట్ ఫొటో షూట్‌తోనే తీసుకున్నారు. ఆర్జీవీకి ఫేస్ బుక్ లో పరిచయమయ్యానని టాప్ సీక్రెట్ ని తెలిపారు శ్రీతేజ్.