Begin typing your search above and press return to search.
అప్పట్లో ఒకడు.. మరో వెరైటీ సినిమా
By: Tupaki Desk | 23 Jan 2017 11:48 AM ISTశ్రీవిష్ణు.. ఈ యువ నటుడు చాలా ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా.. కొన్ని మంచి పాత్రలు చేసినా.. మొన్నటిదాకా జనాల్లో అతడి పేరు పెద్దగా రిజిస్టరవ్వలేదు. కానీ ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమాతో అతడి రాత మారిపోయింది. శ్రీవిష్ణులో ఎంత మంచి నటుడున్నాడో ఈ సినిమా రుజువు చేసింది. ఇందులో అతడి పెర్ఫామెన్స్ చూసి ఆశ్చర్యపోయారంతా. అప్పట్లో ఒకడుండేవాడులో శ్రీవిష్ణు పెర్ఫామెన్స్ చూశాక అతడికి మంచి మంచి అవకాశాలే తలుపు తడుతున్నాయి. ఆల్రెడీ శ్రీవిష్ణు హీరోగా ఒక సినిమా సెట్స్ మీదికి వెళ్లింది. తాజాగా మరో వినూత్న చిత్రానికి అతను శ్రీకారం చుట్టాడు. ఇది ఒక మల్టీస్టారర్ కావడం విశేషం.
ఇంద్రసేన.ఆర్ అనే కొత్త దర్శకుడు శ్రీవిష్ణు కథానాయకుడిగా ఓ చిత్రాన్ని రూపొందించనున్నాడు. అప్పారావు బెల్లన ఈ చిత్రాన్ని నిర్మిస్తాడు. ఇందులో ఒక స్టార్ హీరో.. ఇంకో ఇద్దరు యువ కథానాయకులు.. ఒక కథానాయిక నటిస్తుందట. ఇది ఒక రకంగా మల్టీస్టారర్ అని చెప్పొచ్చు. దీని గురించి దర్శకుడు ఇంద్రసేన మాట్లాడుతూ.. ‘‘రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు ఇది పూర్తి భిన్నంగా ఉంటుంది. ఇదొక యునీక్ స్టోరీతో స్క్రీన్ ప్లే ప్రధానంగా సాగే సినిమా. వెస్టర్న్ స్టయిల్లో ఉంటుంది. ఇందులో మూడు కథలుంటాయి. అవి సమాంతరంగా సాగుతాయి. ఈ మూడు కథల్లోని మిస్టరీని ఛేదించడమే అసలు కథ. థ్రిల్లింగా సాగే ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తాం’’ అన్నాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/