Begin typing your search above and press return to search.
అప్పటి కష్టాల గురించి శ్రీదేవి..
By: Tupaki Desk | 5 July 2017 8:05 AM GMTనిన్నటి తరం నటీనటులెవరినైనా కొంచెం కదిపామంటే చాలు.. ఆ రోజులే వేరు అంటూ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లిపోతుంటారు. అప్పటి రోజుల గొప్పదనం గురించి చెబుతుంటారు. కానీ అలనాటి అతిలోక సుందరి శ్రీదేవి మాత్రం అప్పటి రోజుల్లోని చేదు అనుభవాల గురించే మాట్లాడుతోంది. ఒకప్పుడు షూటింగుల సందర్భంగా ఎన్ని ఇబ్బందులుండేవో ఏకరువు పెడుతోంది. ఇప్పట్లాగా కారవాన్లు.. ఫైవ్ స్టార్ హోటళ్లలో సకల సౌకర్యాలు అప్పుడుండేవి కావని.. తాము షూటింగ్ కోసం చాలా కష్టపడేవాళ్లమని శ్రీదేవి చెప్పుకొచ్చింది. హీరోయిన్లు బట్టలు మార్చుకోవడానికి ఎన్ని కష్టాలుపడేవాళ్లో శ్రీదేవి ‘మామ్’ ప్రమోషన్లలో భాగంగా మీడియాకు వివరించింది.
తాము అప్పట్లో ఎక్కువగా ఔట్ డోర్ షూటింగుల్లో పాల్గొనేవాళ్లమని.. షూటింగ్ స్పాట్లో ఎలాంటి ప్రత్యేక సౌకర్యాలు ఉండేవి కావని శ్రీదేవి తెలిపింది. దీంతో చెట్ల చాటున.. పొదల మాటున తాము బట్టలు మార్చుకోవాల్సిన దుస్థితి ఉండేదని ఆమె చెప్పింది. సెట్లో సరైన మంచి నీళ్లు కూడా అందుబాటులో ఉండేవి కావని.. దీంతో తాను నీళ్లు కూడా తాగకుండా అలాగే పని చేసే దాన్నని చెప్పింది. వాష్ రూమ్స్ అందుబాటులో లేక ఇబ్బంది పడేవాళ్లమంది. వర్షంలో పాటలు తీశారంటే అంతే సంగతులని.. ఆ నీళ్లలో తడిచి తడిచి అనారోగ్యం పాలయ్యేవాళ్లమని శ్రీదేవి తెలిపింది. అప్పటితో పోలిస్తే ఇప్పుడు కారవాన్లతో సహా అన్ని సదుపాయాలూ అందుబాటులో ఉంటున్నాయని.. ఇప్పటి నటీనటులు అదృష్టవంతులని శ్రీదేవి చెప్పింది.