Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: తల్లీకూతుర్లు ఆరబోశారు

By:  Tupaki Desk   |   6 Dec 2016 11:30 AM GMT
ఫోటో స్టోరి: తల్లీకూతుర్లు ఆరబోశారు
X
అసలే అతిలోక సుందరనే పేరు.. సింపుల్ గా వచ్చినా.. చీర కట్టులో సింగారించుకున్నా వేసుకున్న బట్టలకే కొత్త అందం తెచ్చే ఎవర్ గ్రీన్ బ్యూటీ శ్రీదేవి. 50 ప్లస్ లో కూడా చెరగని అందంతో కుర్ర హీరోయిన్స్ కి పోటీ ఇస్తోన్న శ్రీ.. మరోసారి తన డ్రెస్సింగ్ స్టైల్ తో అభిమానులు.. ఫ్యాషన్ ప్రియుల మనసు దోచేసింది.

బాలీవుడ్ ఏస్ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా 50వ బర్త్ డే బాష్ ముంబైలో గ్రాండ్ గా జరిగింది. డైరెక్టర్ కరణ్ జోహార్ ఏరెంజ్ చేసిన ఈ పార్టీకి వన్ థర్డ్ బాలీవుడ్ అటెండైంది. మనీష్ బర్త్ డే పార్టీకి వచ్చిన గెస్ట్స్ లో ఎవరికి వారు గ్లామర్ గా కనిపించినప్పటికీ శ్రీదేవీ అండ్ డాటర్స్ మాత్రం స్పెషల్ ఎట్రాక్షన్ గా నిల్చారు. భర్త బోనీ కపూర్.. కూతుళ్లు జాన్వీ, ఖుషీతో సహా పార్టీకి వచ్చిన శ్రీదేవీ గోల్డెన్ శారీలో నిజంగా అతిలోక సుందరిలా ధగధగ మెరిసిపోయింది.

ఇక శ్రీ డాటర్స్ ఖుషీ - జాన్వీ అయితే పోటీపడి అందాలు ఆరబోశారనే చెప్పాలి. ఫ్యూచర్ హీరోయిన్ రేస్ లో ఉన్న జాన్వీనే కాదు.. చిన్న కూతురు ఖుషీ కూడా డిజైనర్ వేర్ లో అదరగొట్టేసింది. గోల్డ్ కలర్ షార్ట్ గౌన్స్ లో అక్కాచెల్లెళ్లిద్దరూ నువ్వా.. నేనా అన్నట్టు రెడీ అయి పార్టీకి వచ్చిన వాళ్లు మతులు పొగొట్టేశారు. ఒక్కముక్కలో చెప్పాలంటే ఓ ఫ్యాషన్ డిజైనర్ బర్త్ డే పార్టీలో అంతకన్నా స్టైలిష్ గా కనిపించి ఫుల్ మార్క్స్ కొట్టేశారు శ్రీదేవీ అండ్ ఫ్యామిలీ.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/