Begin typing your search above and press return to search.

బాణసంచాను మించేలా ఆ తల్లీకూతుళ్ల సోకులు

By:  Tupaki Desk   |   30 Oct 2016 11:30 AM GMT
బాణసంచాను మించేలా ఆ తల్లీకూతుళ్ల సోకులు
X
ఒకప్పుడు తెలుగు - తమిళ సినీరంగాలను ఏలిన మహారాజ్హి ఆమె. తన పదహారేళ్ల వయసులోనే తన అందచందాలతో ప్రేక్షకుల మనసులను మెలిపెట్టేసిన అతిలోక సుందరి ఆమె. ఇప్పుడు 50 ఏళ్లు దాటినా ఇంకా సరిరారు నాకెవ్వరూ అంటోంది. ఆ సుందరి ఇంకెవరో కాదు.. అలనాటి హీరోయిన్ శ్రీదేవి. ఇప్పుడు తన కుమార్తెను బాలీవుడ్ కు పరిచయం చేయాలని భావిస్తున్న ఆమె కూతురితోనూ అందంలో పోటీ పడుతోంది. అంతేకాదు.. దీపావళి బాణసంచా తళుకులు కూడా ఆ తల్లీకూతుళ్ల సోకుల ముందు వెలవెలపోయేలా ఉన్నాయి.

దీపావళి సందర్భంగా సోషల్ మీడియాలో బాలీవుడ్ ప్రముఖుల చిత్రాలు షికార్లు చేస్తున్నాయి. వారు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టు చేస్తున్నవి కొన్నయితే.. అభిమానులు షేర్ చేస్తున్నవి ఇంకొన్ని. తాజాగా శ్రీదేవి కూడా తన కుమార్తె ఖుషి కపూర్ తో కలిసి అదిరిపోయే డ్రెస్ లో కనువిందు చేస్తూ శుభాకాంక్షలు చెప్పేశారు. ఆ ఇద్దరి అందం... అతిశయం... చూస్తున్న వారు తల్లీకూతుళ్లిద్దరూ మిరుమిట్లు గొలుపుతున్నారంటున్నారు.

ఇంతకీ ఆ సుందరాంగుల అందానికి మరింత వన్నె తెచ్చిందెవరో తెలుసా.. ప్రముఖ డిజైనర్ మనీశ్ మల్హోత్రా వారిద్దరి దుస్తులను డిజైన్ చేశారు. సంప్రదాయ లంగా... ఛోలీ... బంగారు వర్ణ తీగలు మేళవించి రూపొందించిన ఇద్దరు దుస్తులు ఆ గ్రాండ్ లేడీస్ ను మరింత గ్రాండ్ గా చూపిస్తున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/