Begin typing your search above and press return to search.
జాన్వి ఇంకా ప్రిపరేషన్ లోనే ఉంది
By: Tupaki Desk | 14 Aug 2015 6:17 AM GMTఅతిలోక సుందరి శ్రీదేవి ఇటీవలే ఇంగ్లీష్ వింగ్లీష్ తో రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. విజయ్ హీరోగా నటిస్తున్న పులి చిత్రంలో ఓ కీలకపాత్రలో నటించింది. సినిమాల్లో రీఎంట్రీ విషయంలో తప్పటడుగులు పడకుండా జాగ్రత్త పడ్డానని చెబుతున్న శ్రీదేవి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా చాలా సంగతులపై ముచ్చటించారు. ఆ విశేషాలు మీకోసం...
= ఇప్పటివరకూ నేను సాధించినది చాలు. ఈ విషయంలో సంతృప్తిగానే ఉన్నా. దేవుడు ఎప్పుడూ నా వెంటనే ఉన్నాడు. అలాగే అభిమానులు ఇంతకాలం నా వెన్నంటి ఉన్నారు. అందుకే ఎప్పటికీ తప్పు చేయను. మంచి సినిమాల్నే ఎంచుకుని నటిస్తున్నా.
=నా పిల్లలు వారి పిల్లలకు ఇంగ్లీష్ వింగ్లీష్ చూపించాలి. మా అమ్మ ఎంత గొప్ప సినిమాలో నటించిందో అని వారు చెప్పుకోవాలి. అలాంటి సినిమా కాబట్టే అంగీకరించా. గౌరీ షిండే, ఆర్.బాల్కీ నన్ను గుడ్డిగా నమ్మి అవకాశం ఇచ్చినుందుకు వారికి ధన్యవాదాలు.
=ఇంగ్లీష్ వింగ్లీష్ లాంటి మరో మంచి స్క్రిప్టు ఇంతకాలం రాలేదు. అందుకే బాలీవుడ్ లో ఇంతవరకూ సంతకం చేయలేదు. ఇక ఎక్కువ టైమ్ తీసుకోను.
=సద్మా, చాందిని, ఛల్ బాజ్, జుడాయి, మిస్టర్ ఇండియా.. కెరీర్ ఆరంభంలోని సినిమాలివి. అంతవరకూ నన్ను హిందీ జనం ఓ గ్లామర్ డాళ్ గానే చూశారు. మిస్టర్ ఇండియాతో నటిగానూ గుర్తించారు. ఆ తర్వాత లమ్హే చిత్రంతో అంతా మారిపోయింది. ఆ సినిమా తీసిన యశ్ రాజ్ ని మస్సయ్యాను ఇప్పుడు.
=అశుతోష్ గోవారికర్, ఫర్హాన్ అక్తర్, రాఖేష్ ఓంప్రకాష్, రాజ్ కుమార్ సంతోషి, గౌరీ షిండే లాంటి దర్శకులతో పదే పదే నటిస్తా. నేను నా కెరీర్ లో ఛాలెంజింగ్ రోల్స్ కోసం ఇంకా ఇంకా వెతుకుతూనే ఉన్నా.
=జాన్వీ నాలానే హెల్త్ ఫ్రీక్. హెల్త్ క్లబ్బుల చుట్టూ తిరుగుతోంది. ఇప్పటికైతే ఇంకా హీరోయిన్ కాదు. జనాలు పదే పదే అడుగుతున్నారు. తను నటి అవ్వడానిఇ ఇంకా ప్రిపరేషన్ లోనే ఉంది.