Begin typing your search above and press return to search.
అనిల్ అంబానీ ప్రైవేట్ జెట్ లో శ్రీదేవిని తెస్తున్నారు
By: Tupaki Desk | 25 Feb 2018 10:36 PM GMTయావద్దేశాన్ని షాక్ కు గురి చేసిన సినీనటి.. అతిలోక సుందరి శ్రీదేవి తనకు తాను మాత్రం శాశ్విత నిద్రలోకి జారుకున్నారు. ఆమె స్మృతులతో ఆదివారమంతా గడిచిపోయింది. పెళ్లి వేడుకకు కుటుంబ సభ్యులతో కలిసి దుబాయ్ వెళ్లిన శ్రీదేవి.. వేడుక ముగిసిన తర్వాత బాత్రూంలో కార్డిక్ అరెస్ట్ తో మరణించిన సంగతి తెలిసిందే.
గతంలో ఆమెకు ఎప్పుడూ కార్డిక్ సమస్యలు లేవని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కార్డిక్ అరెస్ట్‌కు గురైన వెంటనే వారు బస చేసిన హోటల్ నుంచి అక్కడికి దగ్గరల్లోని రషీద్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అప్పటికే ఆమె మరణించినట్లు చెబుతున్నారు. గుండెపోటుతో మరణించిన శ్రీదేవికి పోస్ట్ మార్టం చేశారు.
పోస్ట్ మార్టం పూర్తి అయ్యాక.. ఆమె మరణానికి సంబంధించిన కారణాలు తెలిపే విశ్లేషణ.. అందుకు సంబంధించిన డెత్ సర్టిఫికేట్ రావాల్సి ఉంది.
దీని కోసం శ్రీదేవి కుటుంబ సభ్యులు వెయిట్ చేస్తున్నారు. మరోవైపు శ్రీదేవి భౌతికకాయాన్ని తెచ్చేందుకు ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి చెందిన ప్రైవేట్ జెట్ ను దుబాయ్ పంపారు. ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఈ జెట్ ముంబయి నుంచి బయలుదేరి దుబాయ్ లో ల్యాండ్ అయ్యింది.
శ్రీదేవి భౌతికకాయాన్ని చూడాలన్న ఉద్దేశంతో ఆమె నివాసం వద్దకు జనం పోటెత్తారు. ముందస్తు జాగ్రత్తగా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. తొలుత ఇంటికి తీసుకెళ్లి.. అనంతరం మొహబూబా స్టూడియోకు పార్థిపదేహాన్ని తరలిస్తారు. బుహులోని శాంతా క్రజ్ శ్మశాన వాటికలో అంత్యక్రియల్ని నిర్వహించనున్నారు.
శ్రీదేవిని తీసుకొచ్చేందుకు అనిల్ అంబానీ పంపిన ప్రైవేట్ జెట్ లో మొత్తం 13 సీట్లు ఉంటాయని చెబుతున్నారు. ఎంబరర్ - 135బీజే రకానికి చెందిన ఈ విమానం రిలయన్స్ ట్రాన్స్ పోర్ట్ అండ్ ట్రావెల్స్ లిమిటెడ్ కింద రిజిస్టర్ అయ్యింది.