Begin typing your search above and press return to search.

బొమ్మరిల్లు మమ్మీలా బిహేవ్ చేస్తోందే

By:  Tupaki Desk   |   8 Feb 2018 4:21 AM GMT
బొమ్మరిల్లు మమ్మీలా బిహేవ్ చేస్తోందే
X
అతిలోక సుందరి శ్రీదేవి సొగసును ఈనాటికీ ఆరాధించే వాళ్లు బోలెడు మంది. అందుకే ఆమె బయట కనిపించిందంటే కెమెరా లు క్లిక్ మంటూనే ఉంటాయి. రాబోయే కాలంలో కాబోయే అప్పరస లాంటి కుమార్తెను వెంటపెట్టుకుని ఫోజులిస్తే ఆ దృశ్యాన్ని బంధించేందుకు వందలాది కెమెరాలు పోటీ పడతాయి.

శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వి కపూర్ వెండితరపై కనిపించడం ఖాయమైపోయింది. మరాఠీ సూపర్ హిట్ మూవీ సైరట్ హిందీ రీమేక్ లో హీరోయిన్ గా నటిస్తోంది. కానీ ఇప్పటికి శ్రీదేవి జాన్వి ఏం చేయాలి.. ఎలా ఉండాలి.. ఎలా ఉండకూడదని చెబుతూ మంచి డిసిప్లిన్ మెయిన్ టెయిన్ చేస్తోంది. ఇది కెమెరా వెనుకే కాకుండా పబ్లిక్ లోకి వచ్చినప్పుడు కూడా ఇదే స్టయిల్ ఫాలో అవుతోంది. రీసెంట్ గా లాక్మే ఫ్యాషన్ వీక్ కు శ్రీదేవి.. జాన్వి ఇద్దరూ వచ్చారు. అక్కడ ఫొటోలకు ఫోజులివ్వడం నుంచి ర్యాంప్ వాక్ వరకు జాన్వి చెయ్యి పట్టుకునే నడిపించింది. కాసేపయ్యాక జాన్వి పక్కకు తప్పుకొంటే శ్రీదేవే సోలోగా ఫొటోలకు ఫోజులిచ్చింది. తరవాత జాన్వి సోలోగా స్టిల్ ఇవ్వడానికి సిద్దమైనా కాదు కూడదంటూ కనుసన్నలతోనే బెదిరించి అక్కడి నుంచి తీసుకెళ్లిపోయింది.

తల్లిగా కూతురి బాగోగుల గురించి ఆలోచించడం గురించి తప్పు పట్టడానికేం ఉండదు. కానీ ప్రతిక్షణం నేను చెప్పినట్టే నువ్వు వినాలని పంతం పట్టినట్టుగా బిహేవ్ చేసే పక్షంలో మాత్రం ఓసారి బొమ్మరిల్లు సినిమా చూడటం బెటర్.