Begin typing your search above and press return to search.

కూతురుకి కండిషన్స్ పెట్టిన శ్రీదేవి!!

By:  Tupaki Desk   |   11 Nov 2016 5:30 AM GMT
కూతురుకి కండిషన్స్ పెట్టిన శ్రీదేవి!!
X
అలనాటి అందాల తారగా శ్రీదేవికి బోలెడంత ఇమేజ్ ఉంది. ఇప్పటికీ ఆమె సినిమాల కోసం ఆత్రంగా ఎదురుచూసే వీరాభిమానులు కొంతమంది ఉన్నారు. ఈమె కూతుర జాన్వి కపూర్ సినీ అరంగేట్రం కూడా చాలా నెలలుగా హాట్ టాపిక్. ఇప్పుడు అప్పుడు అంటూ వాయిదాలు పడుతోందే తప్ప.. ఈ ముహూర్తం మాత్రం రావడం లేదు.

ఇంతలో కూతురు శ్రీదేవి బోలెడన్ని కండిషన్స్ పెట్టిందంటూ వార్తలు వస్తున్నాయి. ఇప్పుడప్పుడే ఎలాంటి బాయ్ ఫ్రెండ్ ఉండకూడదని.. తెలిస్తే ఊరుకోనని తెగేసి చెప్పిందట శ్రీదేవి. బాయ్ ఫ్రెండ్ మాత్రమే కాదు.. ఫ్రెండ్స్ లో ఒక అబ్బాయ్ కూడా ఉండరాదన్న ఈ అమ్మ పెట్టిన కండిషన్. ఈ తరం అమ్మాయికి.. అందులోనూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేసే బ్యూటీకి ఇంత కఠినమైన కండిషన్ పెట్టడానికి కారణం ఉంది. తాజాగా సుశీల్ కుమార్ షిండ్ మనవడితో ముద్దులాడుతూ అమ్మడు అడ్డంగా దొరికిపోవడమే అసలు రీజన్.

షిండే మనవడు శిఖర్ పహారియా.. జాన్వికపూర్ లు తాజాగా ఓ పార్టీకి హాజరయ్యారు. ఆ సమయంలో జాన్వి బుగ్గలపై శిఖర్ ముద్దుపెట్టుకున్న ఫోటో బయటకు వచ్చింది. అంతే కాదు.. ఇద్దరూ లిప్ లాక్ వేసుకున్న ఫోటో కూడా హంగామా చేసేసింది. సరిగ్గా కెరీర్ స్టార్ట్ అవాల్సిన టైంలో ఇలాంటివన్నీ ఎంతగా డ్యామేజ్ చేస్తాయో.. బోలెడంత అనుభవశాలి అయిన శ్రీదేవి.. కూతురుకు స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చిందట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/