Begin typing your search above and press return to search.

శ్రీదేవి కూతురును మేం అడిగిందే లేదు

By:  Tupaki Desk   |   6 Aug 2016 6:02 AM GMT
శ్రీదేవి కూతురును మేం అడిగిందే లేదు
X
ఈ మధ్యన మహేష్‌ బాబు సినిమాల విషయంలో వస్తున్నన్ని రూమర్లు ఇంకా ఏ సినిమాకు సంబంధించి వచ్చుండవేమో. అలాంటి ఓ షాకింగ్ న్యూస్ ఏంటంటే.. అసలు ఆఫర్ చేసినా కూడా శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ఈ సినిమాను వద్దనడమే. ఏకంగా మహేస్‌ సరసన టాలీవుడ్ లో డెబ్యూ అంటూ ఎవరన్నా వద్దనుకుంటారా? ఇదే విషయాన్ని మహేష్‌ సినిమా యునిట్ దగ్గర ప్రస్తావిస్తే ఏమన్నారో తెలుసా?

''ఇప్పటివరకు కేవలం పరిణీతి చోప్రాతో మాత్రమే అనఫీషియల్ డీల్ సైన్ చేశాం. అయితే తన డేట్స్ క్లాష్‌ కావడం వలన ఈ ప్రాజెక్టు చేయలేకపోయింది. ఆ తరువాత ఆలియా భట్ తో చేద్దాం అనుకున్నాం కాని.. వర్కవుట్ కాలేదు. తరువాత రకుల్ ప్రీత్ సింగ్ ను ఎప్రోచ్ అయ్యాం. ఈ ముగ్గురు హీరోయిన్లు తప్పించి అసలు ఎవర్నీ అడగలేదు. శ్రీదేవి కూతురా?? అసలు ఆ థాట్ కూడా రాలేదు మాకు. మరి నేషనల్ మీడియాలో అలాంటి న్యూస్ ఎలా వచ్చిందో అర్ధం కాలేదు'' అంటూ ఈ ప్రాజెక్టుకు సన్నిహితుడు చెప్పారు. మహేష్‌ బాబుతో సినిమా చేయనంది జాన్వి కపూర్ అంటూ తొలుత బాలీవుడ్ టాప్ మీడియాల్లో వార్తలొచ్చాయి. ఇప్పుడు మహేష్‌ సినిమా వర్గీయులు అసలు ఎప్రోచే కాలేదంటున్నారు కాబట్టి.. అవన్నీ రూమర్లే అనుకోవాలి మరి.

మహేష్‌-మురుగుదాస్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది.