Begin typing your search above and press return to search.

వామ్మో.. పెళ్ళికే ఇన్నేసి ఛమక్కులా

By:  Tupaki Desk   |   1 March 2017 10:46 AM GMT
వామ్మో.. పెళ్ళికే ఇన్నేసి ఛమక్కులా
X
ఓ నాలుగు రోజులు క్రితం హీరోయిన్ శ్రీదేవి.. ఆమె భర్త బోనీ కపూర్ మరియు కూతుళ్లు జాన్వి అండ్ ఖుషీ ఒక వివాహానికి హాజరయ్యారు. అసలే హై ప్రొఫైల్ వెడ్డింగ్ కాబట్టి ఖచ్చితంగా మనోళ్లు రిచ్ గానే వెళతారులే. డిజైనర్ మనీష్‌ మల్హోత్రా డిజైన్ చేసిన ప్రత్యేక దుస్తులను ధరించిన శ్రీదేవి.. ఆమె కూతుళ్ళు.. అసలు ఇది పెళ్ళి అనే విషయాన్ని మర్చిపోయినట్లున్నారు.

డ్రస్సంతా బంగారం లేదా వెండి రంగులో ఉండి.. అలానే మొత్తంగా జర్దోసి వర్కుతో నింపబడి.. దానిపై స్పెషల్ అల్లికలు.. రాళ్ళ అమరికలు.. అద్దాల అంటింపులు.. అబ్బో ఆ డ్రస్సులు అద్భుతం అంతే. కాని అక్కడ మరో విషయం ఏంటంటే.. శ్రీదేవి కూతుళ్ళు జాన్వి అండ్ ఖుషీ.. ఈ డ్రస్సుల్లో కూడా ఫుల్లుగా ఎక్సపోజింగ్ చేయడానికే మొగ్గుచూపారు. ఒకరు నడుం అందాలను ఆరబోస్తే.. మరొకరు ఈ డ్రస్సులను కూడా బ్యాక్ లెస్ తరహాలో కుట్టించిన.. మేనిఛాయను బయటేశారు.

కేవలం పెళ్ళిలోనే ఈ రేంజులో రెచ్చిపోతే.. అసలు సినిమాల్లోకి వచ్చాక వీళ్ళను ఎవరైనా ఆపగలుగుతారా? నిజానికి ఒక ప్రక్కన ఆలియా భట్.. శ్రద్దా కపూర్ వంటి స్టార్ కిడ్స్ రెచ్చిపోయి రచ్చ చేస్తున్నారు కాబట్టే.. కాంపిటీషన్ తట్టుకోవడానికి ఇటు జాన్వి అండ్ ఖుషీ కూడా ఇలా టాపు లేపేస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/