Begin typing your search above and press return to search.

మ‌న‌కు 25.. వారికి మాత్రం 24

By:  Tupaki Desk   |   25 Feb 2018 11:08 PM GMT
మ‌న‌కు 25.. వారికి మాత్రం 24
X
అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి బ‌ర్త్ డేట్ అంద‌రికి కామ‌నే. ఈ విష‌యంలో ఎవ‌రికి ఎలాంటి అభ్యంత‌రాలు ఉండ‌వు. 13-08-1963. ఈ డేట్ ఏకాభిప్రాయం ఉన్నా.. ఇప్పుడామె డెత్ డేట్ విష‌యంలోనూ వైరుధ్యం ఉండ‌నుంది. భార‌తీయుల అతిలోక సుంద‌రిగా.. దేశీయ ఫ‌స్ట్ లేడీ సూప‌ర్ స్టార్ గా చెప్పే శ్రీ‌దేవి డెత్ డేట్ ను దుబాయ్ మీడియా డిక్లేర్ చేసింది.

ఆ మాట‌కు వ‌స్తే.. ఆమె డెత్ స‌ర్టిఫికేట్ లోనూ అదే డే్ట్ ఉండ‌నుంది.

శ్రీ‌దేవి మ‌ర‌ణ‌వార్త‌ను క‌వ‌ర్ చేసిన దుబాయ్ కి చెందిన మీడియా సంస్థ‌.. శ్రీ‌దేవి బ‌ర్త్ డేట్‌.. డెత్ డేట్‌ను ప్రింట్ చేసింది. దుబాయ్ కాల‌మానం ప్ర‌కారం ఆమె మ‌ర‌ణం ఫిబ్ర‌వ‌రి 24 సాయంత్రం చోటు చేసుకోవటం.. ఆ విష‌యం ఆల‌స్యంగా భార‌తీయుల‌కు స‌మాచారం అందింది.

శ్రీ‌దేవి మ‌ర‌ణ‌వార్త‌ను ఆమె కుటుంబ స‌భ్యులు క‌న్ఫ‌ర్మ్ చేసేట‌ప్ప‌టికి శ‌నివారం అర్థ‌రాత్రి దాటిపోయింది. సుమారు ఒక‌టిన్న‌ర గంట‌ల ప్రాంతంలో ప్రముఖ మీడియా సంస్థ‌ల‌కు చెందిన ప్ర‌ముఖుల‌కు స‌మాచారం అందింది. అయితే.. దాన్ని క‌న్ఫ‌ర్మ్ చేయ‌టానికి కాస్త స‌మ‌యం ప‌ట్ట‌టం.. మొత్తంగా రెండున్న‌ర గంట‌ల వేళ‌లో శ్రీ‌దేవి ఇక లేర‌ని రూఢీ అయ్యింది. దీంతో ఆమె మ‌ర‌ణం ఫిబ్ర‌వ‌రి 25గా మారింది. అయితే.. మ‌ర‌ణించింది దుబాయ్ లో కావ‌టం.. అక్క‌డి డేట్ ను ప్రాతిప‌దిక‌గా తీసుకున్న‌ప్పుడు ఫిబ్ర‌వ‌రి 24 శ్రీ‌దేవి చివ‌రి రోజుగా చెప్ప‌క త‌ప్ప‌దు. దుబాయ్ ఆసుప‌త్రి.. పోలీసు నివేదిక అధికార ప‌త్రాల్లోనూ అదే డేట్ పేర్కొన‌టాన్ని మ‌ర్చిపోకూడ‌దు.