Begin typing your search above and press return to search.
శ్రీదేవిది హత్య అంటున్న జైళ్ల శాఖ డీజీపీ
By: Tupaki Desk | 10 July 2019 10:35 AM GMTఅతిలోక సుందరి.. సీనియర్ బాలీవుడ్ హీరోయిన్ శ్రీదేవి మరణంపై పోయినేడాది ఫిబ్రవరిలో అందరినీ షాక్ కు గురి చేసిన సంగతి తెలిసిందే. ఆమె మరణంపై మొదట్లో పలు అనుమానాలు వ్యక్తం అయినప్పటికీ.. తర్వాత దుబాయ్ పోలీసులు శ్రీదేవి ప్రమాదవశాత్తూ మరణించిందని.. కుట్రకోణం లేదని తేల్చారు. కానీ తాజాగా కేరళకు చెందిన జైళ్ల శాఖ డిజిపి రిషిరాజ్ శ్రీదేవి మరణంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
కేరళలో ప్రచురితమయ్యే కౌముది అనే పత్రికకు ఆయన రీసెంట్ గా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ లో శ్రీదేవి మరణంపై కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీదేవి మరణం సహజమైనది కాదని.. బాత్ టబ్ లో పడి చనిపోలేదని.. హత్య చేయబడిందని ఆయన అంటున్నారు. రిషి రాజ్ తో తన స్నేహితుడు ఫోరెన్సిక్ సర్జన్ డాక్టర్ ఉమాదతన్ శ్రీదేవి హత్య చేయబడి ఉంటుందని చెప్పడం జరిగిందట. దీంతో ఆ సంఘటన గురించి ఇంకా వివరాలు అడిగాడట. "శ్రీదేవి అతిగా మద్యం సేవించినా కేవలం ఒక అడుగు నీళ్ళల్లో పడి చనిపోయే అవకాశం లేదు. ఎవరైనా వెనుక నుంచి తోస్తేనే అలా జరుగుతుంది. ఒకవేళ అలా కాకుండా ఒక అడుగు లోతు నీరు ఉన్న బాత్ డబ్ లో పడినా అది మరణానికి దారి తీయదు" అని ఆయన చెప్పారట.
ఏదో ఒక సాధారణ వ్యక్తి చేసిన వ్యాఖ్యలు అయితే ఎవరూ పట్టించుకునేవారు కాదు కానీ పలు కేసులను దగ్గరగా చూసిన పోలీసు అధికారి.. పైగా అయన స్నేహితుడు కూడా ఎన్నో ఫోరెన్సిక్ కేసులను డీల్ చేసిన వ్యక్తి కావడంతో ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. అయితే ఈ రిషిరాజ్ చేసిన ఈ వ్యాఖ్యలను మనం జస్ట్ అనుమానాలు లేదా ఆరోపణలు గా తీసుకోవాల్సి ఉంటుంది. ఈయన వ్యాఖ్యలను బట్టి దుబాయ్ పోలీసుల విచారణ సరిగా సాగలేదని ఆరోపించినట్టేననుకోవాలి.