Begin typing your search above and press return to search.

తిరుప‌తితో శ్రీ‌దేవికున్న రిలేష‌న్ ఎంతంటే..?

By:  Tupaki Desk   |   26 Feb 2018 2:48 AM GMT
తిరుప‌తితో శ్రీ‌దేవికున్న రిలేష‌న్ ఎంతంటే..?
X
తిరుప‌తికి శ్రీ‌దేవికి విడ‌దీయ‌లేని బంధం ఉంది. ఆమెకు తిరుమ‌ల శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామి అంటే విప‌రీత‌మైన భ‌క్తి. త‌క్కువ‌లో త‌క్కువ ప్ర‌తి ఏటా స్వామివారి ద‌ర్శ‌నం చేసుకోకుండా ఉండ‌లేరు. ఆ మాట‌కు వ‌స్తే.. శ్రీ‌దేవి పుట్టించి త‌మిళ‌నాడు శివ‌కాశీ అయినా.. ఆమె తిరుప‌తి అమ్మాయిగా చెప్పుకునే వారు లేక‌పోలేదు.

ఎందుకంటే.. ఆమె పేరెంట్స్ తిరుప‌తిలో కొంత‌కాలం నివ‌సించారు. శ్రీ‌దేవి పుట్ట‌టానికి ముందు తిరుప‌తిలోని ఆకుతోట వీధిలో ఉండేవారు. కార‌ణాల రీత్యా చెన్నైకి వెళ్లిపోయినా.. త‌ర‌చూ తిరుప‌తికి వ‌చ్చి వెళుతుండేది. శ్రీ‌దేవి త‌ల్లి సొంత చెల్లులు అన‌సూయ‌మ్మ ఇప్ప‌టికీ తిరుప‌తిలోనే ఉంటారు. తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి వ‌చ్చే శ్రీ‌దేవి అప్పుడ‌ప్పుడు త‌న పిన్ని వ‌ద్ద‌కు వ‌చ్చి వెళుతుంటారు.

శ్రీ‌దేవి మ‌ర‌ణ‌వార్త విన్న వెంట‌నే ఆమె పిన్ని త‌ల్లిడిల్లిపోయారు. ముంబ‌యికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. త‌న బ‌ర్త్ డేకు ముందు కానీ.. త‌న సినిమా విడుద‌ల‌కు ముందు కానీ.. ఏదైనా ముఖ్య‌మైన ప‌ని మొద‌లు పెట్ట‌టానికి ముందు తిరుమ‌ల శ్రీ‌వారి వ‌ద్ద‌కు వ‌చ్చి ఆయ‌న ద‌ర్శ‌నం చేసుకోవ‌టం శ్రీ‌దేవికి అల‌వాటు.

తిరుమ‌ల శ్రీ‌వారి స‌న్నిధికి వ‌చ్చిన ప్ర‌తిసారీ స్వామివారి ద‌ర్శనాన్ని అత్యంత భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో చేసుకునే శ్రీ‌దేవికి సుప్ర‌భాత సేవ అంటే చాలా ఇష్టంగా చెబుతారు. గ‌త ఏడాది జూన్ 24న శ్రీ‌దేవి స్వామివారి ద‌ర్శ‌నం చేసుకున్నారు.మామ్ చిత్రం జులై 7న విడుద‌ల కాగా.. అంత‌కు కొద్దిరోజుల ముందు (జూన్ 24) తిరుమ‌ల‌కు వ‌చ్చి స్వామివారి ద‌ర్శ‌నం చేసుకున్నారు. అదే ఆమె చివ‌రి ద‌ర్శ‌నంగా చెప్పాలి.