Begin typing your search above and press return to search.

వేలం పాట‌: షాకిచ్చిన శ్రీ‌దేవి చీర ధ‌ర

By:  Tupaki Desk   |   27 Feb 2019 4:06 AM GMT
వేలం పాట‌: షాకిచ్చిన శ్రీ‌దేవి చీర ధ‌ర
X
అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి అంత‌ర్ధాన‌మై ఇప్ప‌టికే ఏడాది పూర్త‌యింది. ఇంకా అభిమానుల్లో మామ్ శ్రీ‌దేవి ఆక‌స్మిక మ‌ర‌ణంపై అనుమానాలు అలానే మిగిలి ఉన్నాయి. గ‌తం భ‌విష్య‌త్ ని వెంటాడుతుంది! అన్న చందంగా శ్రీ‌దేవి అభిమానుల‌కు మ‌ర‌పురాని స‌న్నివేశం ఉంది. మామ్ లేదు కాబ‌ట్టి త‌న సినిమాల్లోనే త‌న‌ని చూసుకోవాల్సి ఉంటుంది. అలా చూడాల‌నుకుంటే ఎన్నో క్లాసిక్స్ ఉన్నాయి. వీటితో పాటు `మామ్` ఓ ఇంట్రెస్టింగ్ మూవీనే. శ్రీ‌దేవి మ‌ర‌ణానికి ముందు `మామ్` లాంటి చ‌క్క‌ని సందేశాత్మ‌క‌ చిత్రంలో న‌టించారు. ఆ సినిమాకి విమర్శ‌కుల ప్ర‌శంస‌లే కాదు.. బాక్సాఫీస్ వ‌ద్ద ఫ‌ర్వాలేద‌నిపించే వ‌సూళ్లు ద‌క్కాయ‌ని రిపోర్టులు వ‌చ్చాయి. ప్ర‌స్తుతం ఈ సినిమాని చైనాలో రిలీజ్ చేసేందుకు రెడీ చేస్తున్నారు.

దంగ‌ల్ - సీక్రెట్ సూప‌ర్ స్టార్ చైనాలో ఘ‌న‌విజ‌యం సాధించాయి. ఇండియా వ‌సూళ్ల‌ను మించి చైనీ బాక్సాఫీస్ ఎన్ ల‌ను కురిపించింది. అయితే ఆ తర్వాత మాత్రం మ‌న సినిమాల‌కు స‌రైన స‌క్సెస్ లేదు. అయినా `మామ్` చిత్రంలో శ్రీ‌దేవి పండించిన‌ ఎమోష‌న్‌ చైనీల‌కు న‌చ్చుతుంద‌నే మేక‌ర్స్ భావించి రిలీజ్ చేస్తున్నార‌ట‌. యూనివ‌ర్శ‌ల్ యాక్సెప్టెన్సీ ఉన్న క‌థాంశంతో మామ్ తెర‌కెక్కింది. పాన్ ఇండియా అప్పీల్ ఉంది కాబ‌ట్టి ఆ ఎమోష‌న్ ఏమాత్రం క‌నెక్ట‌యినా హిట్ కొట్టే ఛాన్సుంది.

మ‌రోవైపు అతిలోక సుందరి శ్రీదేవి ధరించిన ఖరీదైన చీరలను వేలం వేసి అలా వచ్చిన డబ్బును ప‌లు స్వచ్ఛంద సేవా సంస్థలకు అందించాలని శ్రీదేవి ఫ్యామిలీ నిర్ణ‌యించుకుందిట‌. సామాజిక మాధ్యమాల్లోనే చీర‌ల్ని వేలం వేస్తున్నారు. వీటికి ధ‌ర అధికంగానే ప‌లుకుతోందిట‌. తాజాగా ఓ చీర‌ను ఆన్ లైన్‌ లో అమ్మారు. శ్రీదేవి ధ‌రించిన ఓ ఖరీదైన చీరకు రూ. 40 వేల ఆరంభ ధ‌ర‌ను నిర్ణయించారు. అది ఆన్‌ లైన్‌ వేలంలో రూ. 1.30 లక్షల ధర పలికింది. ఈ మొత్తాన్ని శ్రీదేవి భర్త బోనీకపూర్ సార‌థ్యంలో న‌డుస్తున్న‌ ఇండియా ఫౌండేషన్‌ అనే స్వచ్ఛంద సేవా సంస్థకు అందించనున్నారు. మహిళలు - అనాథ బాలలు - వృద్ధుల సంక్షేమానికి ఈ డ‌బ్బును వినియోగిస్తార‌ట‌. మునుముందు శ్రీ‌దేవి ధ‌రించిన మ‌రిన్ని చీర‌ల్ని ఆన్ లైన్ లో వేలానికి పెట్ట‌నున్నార‌ని తెలుస్తోంది.