Begin typing your search above and press return to search.
ఆఖరి క్షణంలోనూ అతిలోక సుందరివే!
By: Tupaki Desk | 28 Feb 2018 12:01 PM GMTగుండె పగిలి శోకంలో ఉన్న వేళ.. అందం గురించి మాట్లాడతావేం అనొచ్చు. నిజమే.. అతిలోక సుందరి అందనంత దూరాలకు వెళ్లిపోయింది. చావు.. పుట్టుక అందరికి కామన్. అందుకు అతిలోక సుందరికి మినహాయింపు కాదు. కానీ.. తేడా ఏమిటంటే.. చనిపోయిన తర్వాత కూడా ఇంత చక్కగా.. ప్రశాంత వదనంతో ఉండటం. మేకప్ పుణ్యమో.. మరొక కారణమో కానీ.. శ్రీదేవికి వీడ్కోలు పలికే వేళ.. ఆమెను చూసిన ప్రతిఒక్కరికి.. ఆ ఫ్రేం మస్తిష్కంలో ఉండిపోతుందని చెప్పక తప్పదు.
నిన్న దుబాయ్ ఫోరెన్సిక్ కేంద్రం నుంచి బయటకు వచ్చిన సందర్భంగాశ్రీదేవి పార్థికదేహాన్ని చూపించేందుకు మీడియా పడిన హడావుడి అంతా ఇంతా కాదు. ఆమె ముఖారవిందాన్ని జీవం లేనట్లుగా చూడటం చాలామందికి ఇబ్బందిగా అనిపించొచ్చు. శ్రీదేవి ఒక స్వప్నం. అలా ఉంటేనే మేలు. కానీ.. సంచలనాల కోసం.. మా ఎక్స్ క్లూజివ్ చూడండంటూ.. పోటాపోటీగా టీవీ ఛానళ్లు ఫోటోలు చూపించినప్పుడు ఆమెను అపురూపంగా ఆరాధించే వారి మనసులు ఎంతగా ఫీలై ఉంటాయి.
ఈ రోజు ఆమె అంతిమ యాత్రకు ముందే.. ఆమెకు నివాళులు అర్పించటానికి ముందు ఆమెను పట్టుచీరలో అలంకరించిన వైనం చూసినప్పుడు.. విడువడిన రెండు పెదాల తప్పించి.. ఆమె ముఖం నిర్మలంగా.. ప్రశాంతంగా ఉండటంతో పాటు.. అతిలోక సుందరివే అనిపించేలా ఉండటం కనిపిస్తుంది. శ్రీదేవికి ఎంతో ఇష్టమైన కాంజీవరం చీరలో ఆమెను సిద్ధం చేశారు.ఆమె భౌతికకాయానికి బంగారు వర్ణంతో కూడిన చీరను కప్పి..పూర్తి తెలుపు రంగు పూలతో అలంకరించారు.
శ్రీదేవి అంతిమయాత్ర షురూ కావటానికి ముందు ఆమె భౌతిక కాయాన్ని త్రివర్ణ పతాకంతో కప్పి గౌరవించారు. ఆమె అంతిమయాత్రలో కపూర్ కుటుంబ సభ్యులతో పాటు.. పలువురు బాలీవుడ్.. టాలీవుడ్ తో సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఇక.. జనం సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. ముంబయి మొత్తం స్తంభించిపోయినట్లుగా ఆమె భౌతికకాయాన్ని తీసుకెళుతున్న దారులన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. ఇక.. ఆమె నివసించిన గ్రీన్ ఎకరాస్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో రేపు జరగాల్సిన హోలీ వేడుకల్ని రద్దు చేసుకున్నారు. సెలబ్రేషన్ స్పోర్ట్స్ క్లబ్ నుంచి ఆమె భౌతికకాయాన్ని విలేపార్లే హిందూ శ్మశాన వాటికకు తరలించారు.శ్రీదేవికి ప్రభుత్వ లాంఛనాలతో సత్కరించటంతో పాటు.. ఆమె అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. శ్రీదేవికి ఎంతో ఇష్టమైన ఎరుపు రంగుతో ఆమెను అలంకరించటం..ఆమె ఫోటోను శ్రీదేవి చివరి సంతకంగా అభివర్ణిస్తూ అభిమానులు సోషల్ మీడియాలో ఆమె ఫోటోను షేర్ చేసుకుంటున్నారు.ఈ ఫోటోను చూసినంతనే అతిలోక సుందరికి అసలు రూపం నువ్వే శ్రీదేవి అనిపించక మానదు. ఏమైనా.. మానవా.. ఇక సెలవ్ అంటూ వెళ్లిపోయిన అతిలోక సుందరి గురుతులు మాత్రం ఎప్పటికి నిలిచి ఉండటం ఖాయం.