Begin typing your search above and press return to search.
'మహేశ్ తో ఛాన్స్ అంటే.. మేం చాలా హ్యాపీ'
By: Tupaki Desk | 25 Jun 2017 5:17 AM GMTకొన్ని వార్తలు అలా పుట్టేస్తుంటాయి. అందులో నిజానిజాల మాట ఎలా ఉన్నా.. ప్రచారంలోకి వచ్చిన వార్తే నిజమన్నట్లుగా జనాల మనసుల్లో రిజిస్టర్ అయిపోతుంది. అలాంటి వార్తలు చేసే డ్యామేజ్ ఎంతన్నది చాలామంది పట్టించుకోరు. కానీ.. ఎవరినైతే ఉద్దేశించి రాస్తారో వారు మాత్రం కిందామీదా పడిపోతుంటారు.
అదే సమయంలో తమ మీద జరుగుతున్న నెగిటివ్ ప్రచారాన్ని డైలీ బేసిస్ లో ఖండిస్తూ కూర్చోవటం సాధ్యం కాదు. అలా అని కామ్ గానూ కూర్చోలేరు. సరిగ్గా ఇలాంటి ఇబ్బందికర పరిస్థితినే ఎదుర్కొంటున్నారు ఫిఫ్టీ ప్లస్ వయసులోనూ అతిలోక సుందరి ట్యాగ్ ను తగిలించుకున్న బ్యూటీ శ్రీదేవి. తాజాగా మామ్ మూవీ చేసిన ఆమె.. పలు మీడియా సంస్థలకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.
ఆ వరుసలోనే తెలుగులోని ఒక ప్రముఖ మీడియా సంస్థకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో.. ఆసక్తికరమైన ప్రశ్నకు అంతే ఆసక్తికరంగా సమాధానం చెప్పారు. ఆ మధ్యన ప్రిన్స్ మహేశ్ బాబుతో హీరోయిన్ పాత్రను శ్రీదేవి కుమార్తె జాన్వీకి ఆఫర్ చేశారని.. కానీ ఆమె మాత్రం రిజెక్ట్ చేసిందంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇందులో నిజం మాట ఎంతన్నది శ్రీదేవినే నేరుగా అడిగేస్తే.. అందుకు ఆమె ఇచ్చిన సమాధానం చూస్తే.. ఆసక్తికరంగా మారిందని చెప్పాలి.
ఇంతకీ ఆమె ఏమన్నారన్నది చూస్తే.. "మహేశ్ తో మూవీని జాన్వీ రిజెక్ట్ చేసిందన్న వార్తలు ఎంత అన్యాయమండీ. మహేశ్ బాబు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన ఉన్నారంటే ఆ మూవీని నేను చూడాల్సిందే. మహేశ్ యాక్టింగ్ స్టైల్ ను నేను ఎంజాయ్ చేస్తా. ఒకవేళ మా పాప జాన్వీకి మహేశ్ సరసన చేసే ఛాన్స్ వస్తే మేం చాలా సంతోషపడతాం"
"అలాంటిది ఆయన సినిమాకి అడిగితే జాన్వీ రిజెక్ట్ చేసిందని రాశారు. జాన్వీ వయసు ఎంత? తను ఇంకా సినిమా కూడా మొదలు పెట్టలేదు. అప్పుడే ఒక హీరోని రిజెక్ట్ చేస్తుందా? నిజం ఎంటో తెలుసుకోకుండా ఏది పడితే అది రాసేస్తే.. ఆ అమ్మాయికి ఎంత పొగరు అనరా? అలాంటివి చదివినప్పుడు ఒక తల్లిగా చాలా తల్లడిల్లుతా"
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/