Begin typing your search above and press return to search.
అబ్బా.. ఏం కవరింగ్ చేస్తోందో..
By: Tupaki Desk | 21 Sep 2015 7:30 PM GMTఅలనాటి అతిలోక సుందరి శ్రీదేవి.. మళ్లీ ఆస్థాయి పాత్రతో దక్షిణాదిలో ఎంట్రీ ఇవ్వాలని కోరుకుంది. ఆమె దగ్గరకు వచ్చిన ఎన్నో పాత్రలను కాదని.. చివరకు ఏరి కోరి ఎంపిక చేసుకున్న తమళ చిత్రం పులి. ఈ మూవీలో తనో రాణినని పాత్ర, కాస్ట్యూమ్స్ అన్నీ కొత్తగా కనిపిస్తాయని అంటోదీ పాతతరం అందాల తార. నటిస్తున్నంతసేపు తాను ఎంతో ఎంజాయ్ చేశానని, ప్రేక్షకులను కూడా ఎంటర్ టెయిన్ చేస్తుందని ఓ ఇంటర్వ్యూ లో చెప్పింది శ్రీదేవి. కథ - కథనం - పాత్ర చిత్రీకరణలో విభిన్నత కారణంగానే ఈ చిత్రాన్ని ఎంచుకుందిట.
ప్రచారం కోసం పులి గురించి కాస్త గట్టిగానే డబ్బా వేస్తోందికానీ.. అంతే కాదు.. పులి చిత్రానికి తెలుగు డబ్బింగ్ చెప్పే అవకాశం వేరేవాళ్లకి ఇవ్వడం ఇష్టం లేకే చెప్పిందట. చెబ్తున్నవన్నీ బాగానే ఉన్నాయ్ కానీ.. యూనిట్ ఇస్తున్న లీకులు వేరేగా ఉన్నాయి.
అంతా కలిపి పట్టుమని పావుగంట కూడా శ్రీదేవి పాత్ర కనిపించదని స్ట్రాంగ్ న్యూస్. దీంతో డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా.. స్టూడియో నుంచి రుసరసలాడుతూ వెళ్లిపోయింది శ్రీదేవి. ఆ తర్వాత తెలుగులో డబ్బింగ్ చెప్పడానికి కోటిన్నర డిమాండ్ చేస్తే.. ప్రమోషన్ కోసం తప్పనిసరి పరిస్థితుల్లో ఇచ్చుకోవాల్సి వచ్చింది తెలుగు నిర్మాతలకు. మరేమో తానే ఇష్టపడి గొంతు సవరించుకున్నానని అంటోంది శ్రీదేవి. ఇవన్నీ కాస్త ముందు చెప్పి ఉంటే ఏమన్నా వినేవాళ్లేమో కానీ.. బాహుబలి పైన - పులిలో ప్రాధాన్యం లేని పాత్ర పైనా.. నీ విషయంలో జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది శ్రీదేవీ. టూ లేట్!!