Begin typing your search above and press return to search.
గతం గతహా అంటున్న అతిలోక సుందరి
By: Tupaki Desk | 21 Sep 2015 5:02 AM GMTబాహుబలిలో నటించలేకపోయినందుకు అతిలోక సుందరి శ్రీదేవి పశ్చాత్తాప్పడుతోందా? ఇప్పుడు బాహుబలిని గుర్తు చేసుకోవడానికి కూడా ఆమె ఇష్టపడటం లేదా? శ్రీదేవి ఓ ఇంటర్వ్యూ లో చెప్పిన మాటల్నిబట్టి చూస్తే అది నిజమే అనిపిస్తోంది. ఒకప్పుడు వెండితెరని ఏలిన కథానాయిక శ్రీదేవి. బోనీకపూర్ తో పెళ్లి తర్వాత వెండితెరకు క్రమంగా దూరమైంది. పిల్లలు పుట్టాక చాలా యేళ్లపాటు ఇంటికే పరిమితమైంది. తల్లిపాత్రని ఆస్వాదించాలి కదా అంటూ తన మొదట ప్రాధాన్యత కుటుంబానికే ఇచ్చేసింది. పిల్లలు పెద్దయ్యారు కాబట్టి `ఇంగ్లిష్ వింగ్లిష్`తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. ఆ చిత్రం ఘన విజయం సాధించడం, శ్రీదేవిలో మెరుపు తగ్గలేదన్న విషయం బయటపడ్డంతో ఆమెకు క్రేజీ ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల సంచలనం సృస్టించిన `బాహుబలి`లోనూ నటించే ఛాన్స్ ఆమెని వరించిందట. అయితే రెమ్యునరేషన్ భారీగా డిమాండ్ చేయడంతో ఆమె స్థానంలో రమ్యకృష్ణని ఎంపిక చేసుకొన్నారని టాలీవుడ్ లో ప్రచారం సాగుతోంది. రమ్యకృష్ణ బాహుబలిలో చేసిన శివగామి పాత్రకి చాలా మంచి పేరొచ్చింది.
అప్పట్నుంచి శ్రీదేవి మంచి క్యారెక్టర్ మిస్సయ్యిందే అని మాట్లాడుకొంటుంటారు. అదే విషయాన్ని శ్రీదేవి దగ్గర ప్రస్తావిస్తే ఆమె అసలేమాత్రం బాహుబలి గురించి మాట్లాడుకోవడానికి ఇష్టపడలేదని అర్థమవుతోంది. `గతం గతహా... ఆ సినిమా వచ్చింది, ఆడింది. వెళ్లిపోయింది. ఆ విషయాల్ని ఇప్పుడు మళ్లీ మనం మాట్లాడుకోవడం వృథా` అని ఓ ఇంటర్వ్యూ లో వ్యాఖ్యానించింది శ్రీదేవి. ఇటీవల విజయ్ కథానాయకుడిగా తెరకెక్కిన `పులి`లో కీలక పాత్ర పోషించింది శ్రీదేవి. ఆ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా ఓ ప్రముఖ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో శ్రీదేవి మాట్లాడింది. అందులో బాహుబలి గురించి అడిగిన ఓ ప్రశ్నకు జవాబు చెప్పకుండా దాటవేసినా... తన వ్యక్తిగతం, కెరీర్ కి సంబందించిన విషయాల్ని మాత్రం బోలెడన్ని బయటపెట్టింది. ఇక నుంచి మంచి పాత్రలొస్తే తప్పకుండా నటిస్తానని, నేను సినిమాల్లో నటించినా నటించకపోయినా... ఎప్పటికీ సినిమా మనిషినే అని చెప్పుకొచ్చింది.