Begin typing your search above and press return to search.

శ్రీదేవి ఓ లెజెండ్..ఆమెతో జాన్వీకి పోలికా! బోనీక‌పూర్

By:  Tupaki Desk   |   18 Oct 2022 7:49 AM GMT
శ్రీదేవి ఓ లెజెండ్..ఆమెతో జాన్వీకి పోలికా! బోనీక‌పూర్
X
అతిలోక సుంద‌రి శ్రీదేవి త‌న‌య‌గా..బోనీక‌పూర్ వార‌సురాలిగా జాన్వీ క‌పూర్ కెరీర్ బాలీవుడ్ లో దేదీప్య‌మానంగా సాగిపోతుంది. స్టార్ కిడ్ గా ఎంట్రీ ఇచ్చిన అమ్మ‌డి వెంట బ‌డా బ్యాన‌ర్లే క్యూ క‌డుతున్నాయి. 'ధ‌డ‌క్' తో మొద‌లైన‌ ప్ర‌యాణం 'గుడ్ ల‌క్ జెర్రీ' వ‌ర‌కూ అంతా సాఫీగానే సాగిపోతుంది. ఇప్ప‌టివ‌ర‌కూ అమ్మ‌డికి చెప్పుకోద‌గ్గ భారీ స‌క్సెస్ లేదు.

కానీ అవ‌కాశాల ప‌రంగా ఢోకా లేదు. ధ‌ర్మ‌ప్రొడ‌క్ష‌న్స్ లాంటి న‌యా బ్యాన‌ర్లు ఏరికోరి మ‌రీ జాన్వీని ఎంపిక చేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో జాన్వీ నెపోటిజం బారిన ప‌డింది. దీంతో నెట్టింట ట్రో లింగ్ ని ఎదుర్కోంది. ఇటీవ‌లే జాన్వీ న‌టిస్తోన్న 'మిలీ' ట్రైల‌ర్ రిలీజ్ అయింది. ట్రైలర్ ఆద్యంతం ఆక‌ట్టుకుంది. కోల్డ్ స్టోరేజీలో కూరుకుపోయే అమ్మాయి పాత్రలో జాన్వీ మెప్పిస్తుంది.

దీంతో మొన్న‌ విమ‌ర్శించిన నోళ్లే జాన్వీపై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నాయి. శ్రీదేవిలాగే జాన్వీసైతం త‌ల్లి త‌ర‌హాలో దూసుకుపోతుంద‌ని...త‌న పాత్ర‌ల ఎంపిక‌లో త‌ల్లినే త‌ల‌పిస్తుంద‌ని ప్ర‌శంస‌లు గుప్పిస్తున్నారు. తాజాగా ఈ ప్ర‌శంస‌ల‌పై బోనీ అసంతృప్తిని వ్య‌క్తం చేసారు.

'శ్రీదేవితో జాన్వీని పోల్చ‌వ‌ద్ద‌ని అభ్య‌ర్ధించారు. శ్రీదేవి ఒక లెజెండ‌రీ న‌టి. ఆమెతో జాన్వీని పోల్చ‌డం త‌గ‌దు. పోలిక హుందాగా ఉండాలి. లెజెండ్ తో పోల్చేట‌ప్పుడు చాలా విష‌యాలు ప‌రిగ‌నణ‌లోకి తీసుకోవాల‌ని సూచించారు. అలాగ‌ని జాన్వీని త‌క్కువ చేయ‌డం కాదు. జాన్వీ త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును ద‌క్కించుకునే ప్ర‌య‌త్నాల్లో ఉంది.

'మిలీ' లో బేబీ మంచి స్టెప్పులు వేస్తోందని.. తన నటనతో అందరినీ ఆశ్చర్యపరుస్తుందని' బోనీ తెలిపారు. దీంతో మొన్న‌టి స‌న్నివేశాన్ని గుర్తు చేసుకునే బోనీ జాన్వీ విష‌యంలో అలా స్పందించార‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

జాన్వీపై ప‌డిన నెపోటిజం మ‌ర‌క‌ను చెరిపేసే క్ర‌మంలోనే బోనీ వ్యాఖ్య‌లు క‌నిపిస్తున్నాయంటున్నారు. 'మిలీ' చిత్రాన్ని జాన్వీ తండ్రి బోనీతో క‌లిసి ప్ర‌చారం చేస్తుంది. జాన్వీ జ‌ర్నీ వెనుక తండ్రి కీల‌క పాత్ర పోషిస్తున్నారు అన్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న సూచ‌న‌లు..స‌ల‌హాతోనే అమ్మ‌డు ముందుకు సాగుతుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.