Begin typing your search above and press return to search.
శ్రీదేవి.. కాజల్.. తమన్నా.. రకుల్.. లావణ్యలు చాలా స్పెషల్ గురూ
By: Tupaki Desk | 25 May 2021 6:30 AM GMTసినిమా ఇండస్ట్రీలో హీరోల లైఫ్ స్పాన్ తో పోల్చితే హీరోల లైఫ్ స్పాన్ తక్కువ ఉంటుంది. కొందరు హీరోయిన్స్ స్టార్ డంను దక్కించుకున్నా నాలుగు అయిదు సంవత్సరాల్లోనే కనుమరుగవుతూ ఉంటారు. కొందరు మాత్రం పుష్పర కాలం అయినా కొనసాగుతూ ఉంటారు. కాని హీరోల మాదిరిగా రెండు మూడు దశాబ్దాల సినీ కెరీర్ ను హీరోయిన్ లు కంటిన్యూ చేయలేరు. కొందరు హీరోయిన్స్ మాత్రమే ఇండస్ట్రీలో రెండు తరాల హీరోలతో నటించిన అరుదైన రికార్డును దక్కించుకున్నారు. అందులో కూడా అతి కొద్ది మంది హీరోయిన్స్ మాత్రమే తండ్రి కొడుకులకు జోడీగా హీరోయిన్ గా నటించారు. పైన పేర్కొన్న పేర్లు ఆ స్పెషల్ హీరోయిన్స్ వే.
అప్పటి వరకు ఏ హీరోయిన్ దక్కించుకోని రికార్డును శ్రీదేవి దక్కించుకుంది. ఏయన్నార్ తో చాలా సినిమాల్లో నటించిన శ్రీదేవి ఆయన తనయుడు నాగార్జునతో కూడా నటించింది. ఒకే హీరోయిన్ తండ్రితో కొడుకుతో నటించింది అంటూ అప్పుడు జనాలు ముక్కున వేలేసుకున్నారు. శ్రీదేవి తర్వాత చాలా కాలం వరకు ఆ ఘనత దక్కించుకోలేక పోయారు. చాలా కాలం తర్వాత కాజల్.. తమన్నా.. రకుల్.. లావణ్య త్రిపాఠిలు తండ్రి కొడుకులతో హీరోయిన్ గా నటించిన ఘనత దక్కించుకున్నారు.
కాజల్ మొదట కొడుకు చరణ్ తో నటించి ఆ తర్వాత తండ్రితో నటించింది. చరణ్ తో మగధీర.. నాయక్.. గోవిందుడు అందరివాడేలే సినిమా లను చేసిన కాజల్ ఆ తర్వాత చిరంజీవితో ఖైదీ నెం.150 నటించింది. ప్రస్తుతం ఆచార్య సినిమాలో కూడా ప్రస్తుతం చిరంజీవితో నటిస్తున్న విషయం తెల్సిందే. ఇక తమన్నా కూడా కూడా చరణ్ తో నటించి చిరంజీవితో నటించింది. నాగచైతన్యతో నటించిన తమన్నా నాగార్జున సినిమాలో కూడా నటించింది. కాని ఆ సినిమాలో నాగ్ కు జోడీగా నటించలేదు. ఇక రకుల్ ప్రీత్ సింగ్ నాగచైతన్యతో నటించి ఆ తర్వాత నాగార్జునతో మన్మధుడు 2 సినిమాలో నటించిన విషయం తెల్సిందే. నాగచైతన్యతో నటించిన లావణ్య త్రిపాఠి ఆ తర్వాత నాగార్జునతో కూడా నటించిన విషయం తెల్సిందే. అందుకే ఈ అయిదుగురు హీరోయిన్స్ చాలా స్పెషల్.