Begin typing your search above and press return to search.
శ్రీదేవి 'మామ్' ఫస్ట్ లుక్ అదిరే
By: Tupaki Desk | 14 March 2017 6:39 AM GMTమాజీ అందాల తార శ్రీదేవి.. సుదీర్ఘమైన బ్రేక్ తీసుకుని మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. 2012లో ఇంగ్లీష్ వింగ్లీష్ అంటూ ఆమె చేసిన నటనకు అందరూ ఆశ్చర్యపోయారు. ఇంత వయసులో కూడా శ్రీదేవి అందమే కాదు.. నటనా ప్రతిభ కూడా ఏ మాత్రం తగ్గలేదనే విషయాన్ని గ్రహించారు.
ఇప్పుడు శ్రీదేవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'మామ్' కి ఫస్ట్ లుక్ రివీల్ చేశారు. ఎంతో సీరియస్ గా ఉన్న శ్రీదేవి లుక్ ని సైడ్ యాంగిల్ లోంచి చూపించగా.. మామ్ అనే పదాన్ని అనేక భాషల్లో.. శ్రీదేవి డ్రస్ పై ప్రింట్ చేశారు. అమ్మతనం గురించి చూపించబోతున్న ఈ మూవీలో.. శ్రీదేవి పాత్ర చుట్టూనే కథ కథనం ఉంటాయనే విషయంలో సందేహాలు అక్కర్లేదు. మామ్ ను అనేక భాషల్లో రాసిన విధానం ఆకట్టుకుంటుంది.
అలాగే జూలై 14న మామ్ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నట్లు ఫస్ట్ లుక్ లోనే చెప్పేశారు. అయితే రీ ఎంట్రీ తర్వాత సినిమాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవడంతోనే.. శ్రీదేవికి ఇంత గ్యాప్ వచ్చింది. మధ్యలో తమిళ మూవీ పులిలో నటించినా.. అది నిరుత్సాహపరిచింది. లేటెస్ట్ మామ్ ను హిందీ.. తమిళ్.. తెలుగు భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయబోతోన్నారు. అంతా బాగానే ఉంది కానీ.. శ్రీదేవి మామ్.. అన్ని భాషల్లో మామ్ ను రాశారు కదా.. తెలుగు 'అమ్మ' ఎక్కడా కనిపించడం లేదెందుకో!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/