Begin typing your search above and press return to search.
శ్రీదేవి మాట మార్చేసిందిగా!!
By: Tupaki Desk | 23 Jun 2017 4:32 AM GMTమాజీ అందాల తార శ్రీదేవి తన కూతురు జాన్వి కపూర్ విషయంలో చేసిన కామెంట్స్.. హాట్ టాపిక్ అయ్యాయి. తన కూతురు యాక్టింగ్ కెరీర్ ను ఎంచుకోవడం కంటే.. పెళ్లి చేసుకుని సెటిల్ అయేందుకే తాను ప్రిఫరెన్స్ ఇస్తానని ఓపెన్ గానే చెప్పింది శ్రీదేవి. అయితే.. ఈ తరం అమ్మాయిలపై ఇలాంటి అభిప్రాయం వ్యక్తం చేయడంపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. సోషల్ మీడియాలో చాలామంది శ్రీదేవిని టార్గెట్ చేసేస్తున్నారు.
దీంతో అందరు యాక్టర్స్ మాదిరిగానే.. అదే స్టైల్ లో మాట మార్చేసి.. తన మాటను సరిగా అర్ధం చేసుకోలేదంటూ కొత్త కథ వినిపిస్తోంది శ్రీదేవి. 'నా కామెంట్స్ ను సరిగా అర్ధం చేసుకోలేదు. అమ్మాయిలకు పెళ్లే నయం అని అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. కానీ నేను మాత్రం అమ్మాయిలు తమ సొంతకాళ్లపై నిలబడాలని.. తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకోవాలని చెబుతున్నాను. వారు కోరుకున్నది చేసే హక్కు వారికి ఉంది. ఒత్తిడితో కూడిన జీవితం కంటే.. రిలాక్సెడ్ గా ఉండే లైఫ్ ఉంటే బెటర్ అన్నది మాత్రమే నా ఉద్దేశ్యం. అయితే వారు కోరుకున్న జీవితం అందించాల్సిన బాధ్యత పేరెంట్ గా నా పై ఉంది' అని చెప్పింది శ్రీదేవి.
అసలే మామ్ మూవీ రిలీజ్ కానుంది. ఇలాంటి సమయంలో.. యంగ్ జనరేషన్ అమ్మాయిలపై కామెంట్స్ చేసి.. అనవసరంగా వారి దృష్టిలో విలన్ అయిపోవడం ఇష్టం లేకనే.. శ్రీదేవి ఇలా తన మాటలకు కొత్త అర్ధాలు వెతికి మరీ చెబుతోందని బాలీవుడ్ టాక్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/