Begin typing your search above and press return to search.

అమ్మ ప్రేమ గురించి చెప్పిన శ్రీదేవి

By:  Tupaki Desk   |   24 Jun 2017 5:10 AM GMT
అమ్మ ప్రేమ గురించి చెప్పిన శ్రీదేవి
X
శ్రీదేవి మళ్ళీ తెరపై నటించబోతుంది అన్నప్పటి నుండి శ్రీదేవి అభిమానులు చాల సంతోష పడ్డారు. ఇప్పుడు ఆమె కూతుర్లు కూడా సినీ రంగప్రవేశం చేయబోతున్నారు. ఇంగ్లిష్ వింగ్లీష్ సినిమా హిట్ అవ్వడంతో శ్రీదేవి మళ్ళీ నటించడానికి పూర్తిగా సిద్దపడింది. ఇప్పుడు ‘మామ్’ అనే సినిమాతో మనముందుకు వస్తోంది. సినిమా ట్రైలర్ చూస్తే థ్రిల్లర్ - ఎమోషన్ బాగానే కనిపిస్తుంది. ఈ సారి ఆమె ఒంటరిగా రావటం లేదు టాలెంటెడ్ యాక్టర్ నవజ్జుద్దీన్ సిద్దిక్కి - అక్షయ్ ఖన్నా తో కలిసి వస్తోంది.

ఈ సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చి ఆమె నటించిన మామ్ సినిమా గురించి ఏమందంటే.. “ఈరోజు ఇక్కడకు వచ్చి మీ ముందు మాట్లాడటం - నా పాత మిత్రులు కె.రాఘవేంద్రరావు - సురేష్‌ బాబుని కలవటం అలాగే నా సినిమా రైటర్ కోన వెంకట్‌ తో ఇలా మామ్ సినిమా ప్రచారంలో పాల్గొనటం చాలా సంతోషంగా ఉంది'' అని చెప్పింది. ''ఈ సినిమా విజయం మీ తీర్పు పై ఆధారపడిఉంటుంది. అది ఎలా ఉన్న పర్వాలేదు కానీ ఈ సినిమాలో నటించడం నాకు చాల సంతృప్తిగా ఉంది. నా భర్త నాకు ఇచ్చిన ఒక గొప్ప గిఫ్ట్ ఇది. ఈ సినిమా కోసం మంచి నటులతో పనిచేసే అవకాశం దక్కింది. రహమాన్ లాంటి వారు మ్యూజిక్ ఇవ్వడం ఇంకా సంతోషంగా ఉంది. ఈ సినిమా ఒక అమ్మ ప్రేమ ఎంత విలువైంది ఎంత గొప్పదో చెబుతుంది. అమ్మను అర్ధం చేసుకోవడం చాలా కష్టం. అమ్మ ప్రేమకు వేల కట్టడం కూడా చాలా కష్టం'' అని చెప్పింది. ఈ సినిమాలో శ్రీదేవి కూతురుగా పాకిస్తాన్ నటి సాజల్ ఆలీ నటిస్తోంది.

రవి ఉద్యవార్‌ డైరెక్ట్ చేసిన మామ్ సినిమా జూలై 7 నాడు తెలుగు తమిళ్ మలయాళం హింది భాషలలో విడుదల అవుతోంది. ఈ సినిమాకు సంగీతం ఎ.ఆర్‌.రెహమాన్‌. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే కోన వెంకట్‌ చేశాడు. మామ్ చిత్రానికి నిర్మాతగా శ్రీదేవి భర్త బోనీ కపూర్‌గా ఉన్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/