Begin typing your search above and press return to search.
శ్రీదేవిని ఎవరూ పట్టించుకోలేదా??
By: Tupaki Desk | 5 Aug 2015 5:48 PM GMTశ్రీదేవి... అంటేనే అందాల తార. సౌత్ నుంచి వెళ్లి నార్త్ లో పాగా వేసి, దశాబ్దం పైగా దేశాన్ని ఊపేసింది శ్రీదేవి. ఇంగ్లిష్ వింగ్లిష్ అంటూ బాలీవుడ్ లో రీఎంట్రీ ఇచ్చిందీ మాజీ సుందరి. సౌత్ లో ఇప్పటికీ శ్రీదేవి అంటే క్రేజ్ విపరీతంగానే ఉంటుంది. అదే ఉద్దేశ్యంతో మహారాణి కేరక్టర్ కోసం... ఈ అభినయరాశినే తెచ్చి పెట్టుకున్నారు పులి టీం. వచ్చే నెలలో రిలీజ్ కానున్న ఈ మూవీమీద అంచనాలు బాగానే ఉన్నాయి. ఇప్పటికే ప్రమోషన్ కూడా ఓ లెవెల్ లో ఉంది.
పులి పబ్లిసిటీ కోసం చెన్నై వచ్చింది శ్రీదేవి. ఇకపై తమిళంలో వరుసగా సినిమాలు చేస్తానని కూడా చెప్పింది. అసలు చెన్నై అంటే నాకు సొంతిల్లులాంటిది అంటూ కబుర్లు కూడా చెప్పేసింది. అయితే... శ్రీదేవి ఇన్ని మాట్లాడినా... ఎవరూ ఆమెను పట్టించుకోలేదు. కనీసం చెన్నై వచ్చినట్లు కూడా ఎక్కడా వార్తలు రాలేదు. తమిళ్, తెలుగు, హిందీ మీడియా వాళ్లు కూడా పట్టించుకోలేదు. ఎంతలా అంటే... కనీసం ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు శ్రీదేవి పెర్ఫామెన్స్, గెటప్ గురించి మాట్లాడినంత కూడా... హైప్ రాలేదు.
అంతేలెండి, ఎంత సుందరాంగిఅయినా... ఇప్పుడు మాత్రం మాజీయే కదా. అందులోనూ ఈ అతిలోక సుందరి ఒక్కో సినిమాకి ఎంతివ్వాలో తెలుసా ? అక్షరాలా రెండు కోట్లు తీసుకుందట పులిలో చేసేందుకు ! అంత ముట్టచెబితే.. అప్ కమింగ్ హీరోయిన్స్ ని అరడజన్ మందిని తీసుకోవచ్చు కదా అనుకుంటున్నారు నిర్మాతలు. దీనికేమైనా సమాధానం చెబ్తుందో... లేక దేవీ మౌనమా... శ్రీదేవీ మౌనమా అని పాడుకోమంటుందో...