Begin typing your search above and press return to search.
మామ్ కు ఆయనే న్యాయం చేయగలడు
By: Tupaki Desk | 28 Jun 2017 5:31 AM GMTఒకనాటి అందాల తార శ్రీదేవి.. ఇంగ్లీష్ వింగ్లీష్ అంటూ గ్రాండ్ రీఎంట్రీనే ఇచ్చినా.. వరుసగా సినిమాలు చేసేయాలనే రూల్ ఏమీ పెట్టుకోలేదు. తన ఇద్దరు కూతుళ్ల కెరీర్ పై ఫోకస్ పెట్టి.. ఎక్కువకాలం వారికోసం కేటాయిస్తున్న శ్రీదేవి.. ప్రస్తుతం మామ్ మూవీని రిలీజ్ కి రెడీ చేసింది.
రియల్ లైఫ్ లో ఇద్దరు కూతుళ్లకు అమ్మ అయిన శ్రీదేవి.. మామ్ సినిమాలోనూ ఇద్దరు అమ్మాయిలకు తల్లిగా కనిపించబోతోంది. ఈమె నటించిన 300వ చిత్రం కావడంతో.. మామ్ మూవీ సక్సెస్ కోసం బాగానే ప్రయత్నిస్తోంది శ్రీదేవి. రీసెంట్ గా ఈ చిత్రం తమిళ్ వెర్షన్ ప్రచారం కోసం చెన్నై చుట్టేసింది. మామ్ కు ఏఆర్ రెహమాన్ సంగీతం ఇవ్వడంపై బోలెడంత సంతోషం వ్యక్తం చేసింది శ్రీదేవి. 'ఏఆర్ రెహమాన్ తో కలిసి పని చేయాలనే నా కల ఇన్నేళ్లకు తీరింది. సినిమా ప్రారంభం నుంచి ఆయన అయితేనే ఈ ఎమోషనల్ డ్రామాకు.. ప్రాణం పోసే సంగీతం ఇవ్వగలరని ముందు నుంచి నమ్మాం. ఇప్పుడు రెహమాన్ ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు. ఇదంతా చూస్తుంటే నేను ఎంతో అదృష్టం చేసుకున్నా అనిపిస్తోంది' అని చెప్పింది శ్రీదేవి.
'ఈ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాలో ఒక తల్లి.. తన ఇద్దరు కూతుళ్లతో అనుబంధం గురించి కథ నడుస్తూ ఉంటుంది. నేను కూడా ఇద్దరు అమ్మాయిలకు తల్లి కావడంతో ఆ పాత్రకు బాగా దగ్గరయ్యాను. ఎంత ఎదిగినా తమిళ్ ఇండస్ట్రీ నన్ను ఆదరించిన సంగతి మర్చిపోలేను. అందుకే తమిళ్ వెర్షన్ కు నేనే డబ్బింగ్ చెప్పుకున్నాను' అంటూ కోలీవుడ్ ప్రచారం చేస్తోంది శ్రీదేవి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/