Begin typing your search above and press return to search.
శ్రీదేవి వాళ్ల కష్టాన్ని అర్థం చేసుకుందట
By: Tupaki Desk | 12 Nov 2015 1:30 PM GMTవారం రోజులుగా ఎక్కడ చూసినా ఒకటే చర్చ… తనకు రావాల్సిన బ్యాలెన్స్ రెమ్యూనరేషన్ కోసం ‘పులి’ ప్రొడ్యూసర్ల మీద నిర్మాతల మండలిలో శ్రీదేవి ఫిర్యాదు చేయడం మీద పెద్ద సౌత్ ఇండియాలోనే కాదు.. బాలీవుడ్ లోనూ హాట్ టాపిక్ అయింది. ఈ విషయంలో పులి నిర్మాతలు కూడా శ్రీదేవి మీద ఎదురు దాడికి దిగడం.. వ్యవహారం మరింత వేడెక్కింది. దీంతో గొడవ ఎక్కడిదాకా వెళ్తుందో అని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. శ్రీదేవి ఈ విషయమై కోర్టుకు కూడా వెళ్లొచ్చన్న ప్రచారం జరిగింది.
ఐతే తమిళ నిర్మాతల మండలి జోక్యంతో గొడవ సద్దుమణిగింది. ఇరు వర్గాలు రాజీకి వచ్చేశాయి. శ్రీదేవితో వ్యవహారం ముగిసిన కథ అంటూ క్లారిటీ ఇచ్చారు నిర్మాతలు ‘పులి’ నిర్మాతలు. శ్రీదేవి - బోనీ కపూర్ లతో చర్చించామని.. వారికి తమ పరిస్థితి చెప్పగా అర్థం చేసుకున్నారని.. ఈ విషయంలో వారికి ధన్యవాదాలు చెబుతున్నామని ప్రకటన ఇచ్చారు ‘పులి’ నిర్మాతలు. ‘పులి’ సినిమాకు గాను శ్రీదేవికి రూ.3 కోట్లు పారితోషకం ఇవ్వడానికి అంగీకరించారట నిర్మాతలు. ఐతే ముందు రెండున్నర కోట్లు ఇచ్చి.. మిగతా యాభై లక్షలు తర్వాత ఇవ్వడానికి అంగీకారం కుదిరిందట. ఐతే సినిమా అట్టర్ ఫ్లాప్ కావడంతో నిర్మాతలు మిగతా 50 లక్షలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. కానీ ఇంతలోనే శ్రీదేవి నిర్మాతల మండలి దగ్గరికి వెళ్లిపోయింది. ఐతే తమ పరిస్థితి చెబుతూ.. మిగతా పారితోషకం ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నామని చెప్పడంతో శ్రీదేవి అర్థం చేసుకుని ఫిర్యాదు వెనక్కి తీసుకుందట.