Begin typing your search above and press return to search.
అబ్బో.. శ్రీదేవి ఎంత త్యాగం చేసిందో?
By: Tupaki Desk | 5 Jun 2017 7:40 AM GMTసినిమా షూటింగ్ అన్నాక వేళా పాళా ఉండదు. లీడ్ రోల్ చేస్తున్నపుడు ఎప్పుడు అవసరమైతే అప్పుడు షూటింగ్ కోసం అందుబాటులో ఉండాల్సిందే. అనుకున్న షెడ్యూల్ ప్రకారం షూటింగ్ పూర్తి కావాలంటే హీరో అయినా.. హీరోయిన్ అయినా సాధ్యమైనంత ఎక్కువ సమయం సెట్లో ఉండాల్సిందే. అలాంటి సమయంలో కుటుంబానికి కొంచెం దూరంగా ఉండక తప్పదు. ఈ విషయాన్ని కొంచెం ఎగ్జాజరేట్ చేసి చెబుతోంది సీనియర్ హీరోయిన్ శ్రీదేవి. తాను ప్రధాన పాత్ర పోషించిన ‘మామ్’ కోసం తాను చాలా కష్టపడ్డానని.. దాని కోసం కుటుంబాన్ని కూడా పట్టించుకోలేదని ఆమె అంటోంది.
‘మామ్’ కోసమని దాదాపు మూడు నెలల పాటు కుటుంబానికి పూర్తిగా దూరమయ్యానని శ్రీదేవి చెప్పింది. ఆ మూడు నెలల్లో తన భర్త బోనీ కపూర్ తో మామూలుగా మాట్లాడిందే లేదని ఆమె వెల్లడించింది. ఉదయం లేవగానే గుడ్ మార్నింగ్ చెప్పి వచ్చేయడం.. రాత్రి షూటింగ్ అయ్యాక ఇంటికెళ్లి గుడ్ నైట్ చెప్పడం.. తప్పితే అంతకుమించి ఒక్క మాటా మాట్లాడింది లేదని.. ఇలా మూడు నెలలు సాగిందని శ్రీదేవి చెప్పింది. ఐతే శ్రీదేవి మాత్రమే కాదు.. ఒక సినిమా లీడ్ రోల్ చేస్తున్నపుడు అది పూర్తయ్యేవరకు ఎవ్వరైనా కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాల్సిందే. సినీ రంగానికి చెందిన వాళ్లే కాదు.. క్రీడాకారులు సైతం నెలల తరబడి ఆట కోసం కుటుంబాలకు దూరమవుతుంటారు. పేరు.. డబ్బు భారీ స్థాయిలో వస్తున్నపుడు ఆమాత్రం త్యాగాలు చేయకుంటే ఎలా మరి?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/