Begin typing your search above and press return to search.
డిఫరెంట్ ప్రమోషనల్ స్ట్రాటజీతో 'శ్రీదేవి సోడా సెంటర్'
By: Tupaki Desk | 25 Aug 2021 5:30 PM GMTసుధీర్ బాబు - ఆనంది హీరో హీరోయిన్లుగా 'పలాస 1978' ఫేమ్ కరుణ కుమార్ తెరకెక్కించిన తాజా చిత్రం ''శ్రీదేవి సోడా సెంటర్''. నిజ జీవిత పాత్రల ఆధారంగా పల్లెటూరి నేపథ్యంతో ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ని రూపొందించారు. ఈ నెల 27న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి.
ఇప్పటికే విడుదల చేయబడిన ప్రచార చిత్రాలు - టీజర్ - ట్రైలర్ - పాటలు విశేష స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో 'శ్రీదేవి సోడా సెంటర్' చిత్రంలోని ఒక్కొక్క పాత్రను పరిచయం చేస్తూ వీడియోలను రిలీజ్ చేస్తున్నారు. ఇందులోని పాత్రలు ఎంత బలంగా ఉంటాయో తెలియజేయడానికి మేకర్స్ ఇలాంటి ప్రమోషనల్ స్ట్రాటజీని ఫాలో అవుతున్నారని తెలుస్తోంది.
ఈ చిత్రంలో లైటింగ్ సూరిబాబు గా సుధీర్ బాబు.. సోడాల శ్రీదేవిగా ఆనంది కనిపించనున్నారు. అలానే ప్రతినాయకుడు కాశీ గా పావెల్ నవగీతన్.. శ్రీదేవి తండ్రి సంజీవ్ రావు గా నరేష్ లను పరిచయం చేసారు. అంతేకాదు హీరో ఫ్రెండ్ కర్రి దుర్గారావు గా సత్యం రాజేష్ - ఎండ్లూరి నరసయ్య గా రఘుబాబు - హీరోయిన్ తల్లి ధనలక్ష్మి గా కళ్యాణీ రాజు - చిత్తూరి శివ గా ప్రవీణ్ నటిస్తున్నారు.
అలానే 'శ్రీదేవి సోడా సెంటర్' ఫస్ట్ సాంగ్ ను మెగాస్టార్ చిరంజీవి.. ట్రైలర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా లాంచ్ చేయించారు మేకర్స్. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో స్పెషల్ ఇంటర్వ్యూలు ప్లాన్ చేసి సినిమాపై బజ్ క్రియేట్ అయ్యేలా చేశారు. ఈ విధంగా సినిమాకు కావాల్సినంత పబ్లిసిటీ చేస్తూ వస్తున్నారు. దీంతో ఈ సినిమా నాన్-థియేట్రికల్ బిజినెస్ కూడా బాగా జరిగింది.
ఇకపోతే 'యూ/ఏ' సెన్సార్ సర్టిఫికేట్ అందుకున్న ఈ చిత్రాన్ని అత్యధిక థియేటర్లలో విడుదల చేస్తున్నారు. సుధీర్ బాబు కెరీర్ లో ప్రత్యేకమైన సినిమాగా నిలిచిపోతుందని చిత్ర యూనిట్ చెబుతూ వస్తోంది. మరి 'శ్రీదేవి సోడా సెంటర్' ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి. కాగా, 70mm ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై విజయ్ చిల్లా - శశి దేవిరెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. 'భలే మంచి రోజు' తర్వాత ఈ సంస్థలో సుధీర్ చేస్తున్న రెండో సినిమా ఇది. దీనికి మణిశర్మ సంగీతం సమకూర్చగా.. శ్యామ్ దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ అందించారు.. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేశారు.