Begin typing your search above and press return to search.
శ్రీదేవికి అంత ఇదేంటో?
By: Tupaki Desk | 22 Feb 2017 8:15 AM GMTగ్లామర్ ఫీల్డులో ఉన్న వాళ్లతో వచ్చిన ఇబ్బంది ఇదే. వయసు మీద ఉన్నపుడు ప్రపంచమంతా తమ చుట్టూ తిరిగేసరికి.. వయసు మీద పడ్డాక కూడా తమ అందానికి తిరుగులేదని అనుకుంటారు. అందులోనూ దేశమంతా తనను అతిలోక సుందరి అని కీర్తించి.. కోట్లాది మంది తన అందానికి దాసోహం అయిపోయేసరికి శ్రీదేవికి ఈ ఫీలింగ్ మరీ ఎక్కువ ఉన్నట్లుంది. తనకు యాభై ఏళ్లు దాటిపోయిన సంగతి అంగీకరించకుండా ఇప్పటికీ పడుచు పిల్లలాగా తయారవడానికి ఆమె తహతహలాడిపోతుండటం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది.
శ్రీదేవి ఒకప్పుడు అతిలోక సుందరే. కానీ ఆమెలో గ్లో పోయి దశాబ్దం దాటిపోయింది. కానీ ఆమె మాత్రం ఆ విషయాన్ని అంగీకరించట్లేదు. తన కూతుళ్లతో పోటీ పడి భారీ మేకప్పులతో.. స్టైలింగ్ తో రెడీ అయి మీడియా ముందుకొస్తోంది. ఫొటో షూట్లు చేస్తోంది. 40ల్లో ఇలాంటి ప్రయత్నాలు చేయడాన్ని అర్థం చేసుకోవచ్చు. అప్పటికి వయసు మీద పడ్డ విషయాన్ని అంగీకరించడానికి ఆమె సిద్ధపడకపోవడమే ఆశ్చర్యం.
వయసుకు ఎదిగిన కూతుళ్లకు పోటీగా తాను కూడా భారీ మేకప్ తో సెక్సీగా తయారవుతూ ఆమె ఫొటోలకు పోజులివ్వడం చూసేవాళ్లకు ఏదోలా అనిపిస్తోంది. అందంగా కనిపించాలనే తాపత్రయంతో ఆమె కాస్మొటిక్ ఉత్పత్తులు అతిగా వాడేస్తోందని బాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇకనైనా ఈ అతి కొంచెం తగ్గించుకోకుంటే జనాల్లో ఆమె మీద వ్యతిరేక అభిప్రాయం పెరిగి.. ఆమెపై గౌరవభావం తగ్గడం ఖాయం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/