Begin typing your search above and press return to search.
పాత హీరోయిన్.. కొత్త యాప్
By: Tupaki Desk | 9 Aug 2017 8:54 AM GMTఇప్పుడు ఉన్న ఈ డిజిటల్ ప్రపంచంలో వార్తలు విశేషాలు ఎక్కువగా అందరూ తెలుసుకుంటుంది అంతే మాత్రం అది సోషల్ మీడియా ద్వారానే అనే చెప్పవచ్చు. అయితే ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు హవా పెరగడంతో కొంతమంది స్టార్స్ వాళ్ళ సొంత ఆప్ డిజైన్ చేసుకొని వాళ్ళకి సంబందించిన వార్తలు ఎప్పటికీ అప్పుడు ఆ యాప్ లో పోస్ట్ చేస్తూ అభిమానులుకు దగ్గరగా ఉంటున్నారు. బాలీవుడ్ హీరోయిన్లలో మొదటిసారి వాళ్ళకంటూ ఒక ఆప్ ఉంది అంటే అది ఒక్క సోనమ్ కపూర్ కే. ఆ తరువాత దిశా పటాని - అమీ జాక్సన్ - నర్గీస్ ఫక్రి మొదలుపెట్టారు. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి నిన్నటి తరం హీరోయిన్ శ్రీదేవి కూడా చేరింది.
90 దశకంలో స్టార్లు అయన ఎవరికి ఇటువంటి ఆప్ లు లేవు ఒక్క సల్మాన్ ఖాన్ ‘బీయింగ్ హ్యూమన్’ ఆప్ తప్పించి. కింగ్ ఖాన్ షారూక్ ఖాన్ కూడా తనకంటూ ఒక యాప్ పెట్టుకోలేదు. అయితే ఇప్పుడు శ్రీదేవి మాత్రం తన కోసం తన అభిమానులు కోసం ఒక ఆప్ ని డిజైన్ చేసుకోవాలి అనే ఆలోచనలో ఉంది. ఇదే మాట శ్రీదేవిని అడిగితే “ సోషల్ మీడియా అనేది ఇప్పుడు అభిమానులకు దగ్గర కావడానికి మంచి పద్దతి. నాకు చాలా ఇష్టం నా అభిమానులతో నా జీవిత విశేషాలు పంచుకోవడం అని చెబుతుంది. ప్రతీ దానిలోనూ పొజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది. నేను అయితే సోషల్ మీడియా వలన ఎటువంటి ఇబ్బంది ఉంటుంది అని నేను అనుకోవటం లేదు” అంటోంది శ్రీదేవి.
ఇకపోతే ఈ లేటు వయస్సులో ఈమెకు అస్సలు యాప్ ఎందుకు అని అడిగేవాళ్ళూ లేకపోలేదు. కాని అమ్మడు మాత్రం తనింకా సినిమాల్లో కొనసాగుతున్నానని.. అందుకే తన గురించి తెలుసుకోవాలనే వారి సంఖ్య చాలా అధికంగానే ఉందని చెబుతోంది. ఏదేమైనా 'మామ్' సినిమా ఫ్లాపయ్యాక శ్రీదేవి మరోసారి క్రేజ్ పెంచుకోవడానికి ఇలాంటి కొత్త మార్గాలను బాగానే అన్వేషిస్తోంది.