Begin typing your search above and press return to search.
అంత అరవ ప్రేమ ఎందుకో
By: Tupaki Desk | 11 Jan 2018 7:16 AM GMTఅతిలోకసుందరి అనే పదం ఎక్కడ వినిపించినా వెంటనే గుర్తొచ్చే పేరు శ్రీదేవి. అందానికి ప్రతిరూపంగా అప్పటి యువతరానికి నిద్ర లేకుండా చేసిన శ్రీదేవి వర్మ లాంటి వాళ్ళను సైతం తన భక్తులుగా మార్చుకుంది అంటే ఇక ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమి లేదు. అందుకే సిరివెన్నెల గారు అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా అని ఒక పాటలో తన గురించి ఊరికే రాయలేదు. హిందిలో ఎన్ని సినిమాలు చేసినా శ్రీదేవి అక్కడి ఇమేజ్ తో సమానంగా ఇంకా చెప్పాలంటే ఓ మోతాదు ఎక్కువగా గుర్తింపు ఇచ్చింది, నెత్తినబెట్టుకుంది ముమ్మాటికి తెలుగు సినిమా పరిశ్రమే. ఎన్టీఆర్ మొదలుకొని చిరంజీవి దాకా అందరు హీరోలతోనూ ఆడిపాడే అవకాశాలు రావడమే కాదు మర్చిపోలేని ఎన్నో గొప్ప ఆణిముత్యాలు తనకు ఇక్కడి సినిమా ఇచ్చింది.
తన కూతురు జాహ్నవిని సినిమాకు పరిచయం చేయాలి అనుకున్నప్పుడు తెలుగులో చేస్తుందేమో అని అందరు ఎదురు చూసారు. కాని తను మాత్రం హిందికే మొగ్గు చూపింది. మరాటి సైరాట్ రీమేక్ ధడక్ లో కూతురిని లాంచ్ చేస్తోంది శ్రీదేవి. అది షూటింగ్ చివరి దశలో ఉంది. అది విడుదల కాకముందే సౌత్ సినిమాకు కూడా తనను పరిచయం చేయాలనీ శ్రీదేవి ఆలోచన. అది కూడా తెలుగులో కాకుండా తమిళ్ సినిమాతో తెరంగేట్రం చేయించాలనే ప్లాన్ లో ఉందట. ఇది విని ఆమె అభిమానులతో పాటు మూవీ లవర్స్ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
పుట్టి పెరిగింది ముంబై కాబట్టి జాహ్నవిని హింది సినిమాతో వెండితెరకు పరిచయం చేయటం పట్ల ఎటువంటి అభ్యంతరం లేదని, కాని తనకు లైఫ్ ఇచ్చిన తెలుగు పరిశ్రమను మర్చిపోయి తమిళ సినిమా ద్వారానే చేయాలి అనుకోవడం ఎంత వరకు సబబు అని ప్రశ్నిస్తున్నారు. కోరి వచ్చిన బాహుబలి అవకాశాన్ని వద్దనుకుంది అనే దాని గురించి శ్రీదేవి మీద గతంలో పెద్ద చర్చే జరిగింది. అదే పనిగా ఇష్టపడి తమిళ్ లో రీ ఎంట్రీ పేరుతో విజయ్ పులి సినిమాలో చేస్తే డిజాస్టర్ అయ్యింది. ఇన్ని జరిగినా తెలుగు మీద చిన్న చూపేలా అంటున్న ప్రశ్నకు శ్రీదేవి జవాబు ఏమిటో.