Begin typing your search above and press return to search.
శ్రీదేవిని ఇలా చేశారెందుకు?
By: Tupaki Desk | 4 Sep 2019 5:56 AM GMTరామ్ గోపాల్ వర్మ గోవిందా గోవిందా సినిమాలో ఒక పాట ఉంటుంది. హీరోయిన్ శ్రీదేవి అందాన్ని వర్ణిస్తూ సీతారామశాస్త్రి గారు అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా కనక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా అని రాశారు. ఆయన ఏ భావంతో రాసినా శ్రీదేవి అందం గురించిన ఈ మాటలు అక్షర సత్యం. ఇప్పటికీ శ్రీదేవిని తలదన్నే అందగత్తె కానీ యాక్టింగ్ బ్యూటీ కానీ బాలీవుడ్ లో లేదంటే అతిశయోక్తి కాదు. అలాంటిది అందాన్ని మేడం టుస్సాడ్ మ్యూజియం వాళ్ళు మైనపు బొమ్మ రూపంలో పునఃసృష్టి చేయాలనుకోవడం మంచి ఆలోచనే.
కానీ తీరా కార్యరూపం దాల్చాక ఆ బొమ్మ అతిలోకసుందరి ఫ్యాన్స్ ని తీవ్రంగా నిరాశ పరుస్తోంది. కారణం ఏ యాంగిల్ లోనూ ఆ స్టాచ్యూలో శ్రీదేవి పోలికలు అంతగా లేకపోవడమే. కాస్ట్యూమ్స్ వరకు 90స్ లుక్ ని తీసుకొచ్చారు కానీ కీలకమైన ముఖ కవళికల్లో మాత్రం శ్రీదేవి పోలికలు తీసుకురాలేక చేతులెత్తేశారు.సాధారణంగా టుస్సాడ్ మ్యూజియం వాళ్ళు బ్రతికున్న వాళ్ళ దగ్గర నుంచి లైవ్ గా కొలతలు ఫోటోలు స్కిన్ టోన్ మెజర్ మెంట్స్ అన్ని పక్కాగా తీసుకుంటారు.
మహేష్ బాబు ప్రభాస్ సన్నీ లియోన్ వీళ్లకు అలాగే చేశారు. అందుకే ఆ బొమ్మలు చక్కని జీవకళతో ఉంటాయి. కానీ శ్రీదేవి ఇప్పుడు లేరు. అందుబాటులో ఉన్న సినిమాల వీడియోలు ఫొటోలే ఆధారం. అయినా టెక్నాలజీ ఇంత విస్తృతంగా అందుబాటులో ఉన్న ట్రెండ్ లో టుస్సాడ్ టీమ్ ఇంకాస్త శ్రద్ధగా శ్రీదేవి విగ్రహాన్ని రూపొందించి ఉంటె బాగుండేదన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. మళ్ళీ బ్రహ్మయినా శ్రీదేవి లాంటి అందాన్ని సృష్టించగలడా అనే మాటను నిజం చేస్తూ టుస్సాడ్ వాళ్ళు ఈ బొమ్మ విషయంలో అంచనాలు అందుకోలేకపోయారు