Begin typing your search above and press return to search.
కష్టపడి పైకొచ్చిన హీరోను కామెంట్ చేయడం తేలికే!
By: Tupaki Desk | 15 Sep 2022 4:10 AM GMTహీరో కిరణ్ అబ్బవరం - దర్శకుడు శ్రీధర్ గాదె ఇద్దరూ కలిసి కొంతకాలం క్రితం చేసిన 'ఎస్.ఆర్. కల్యాణ మంటపం' సినిమా భారీ విజయాన్ని సాధించింది. దాంతో ఈ ఇద్దరూ కలిసి మరో ప్రయత్నంగా 'నేను మీకు బాగా కావాల్సినవాడిని' సినిమా చేశారు. యూత్ .. మాస్ .. ఫ్యామిలీ ఆడియన్స్ క్లి నచ్చే అంశాలను కలిపేసి ఈ సినిమాను రూపొందించారు. ఈ నెల 16వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాదులో నిర్వహించారు.
ఈ వేదికపై శ్రీధర్ మాట్లాడుతూ .. హీరోయిన్స్ ఇద్దరూ కూడా కొత్తవారే అయినా తెలుగు బాగా మాట్లాడతారు. అందువలన వాళ్ల నుంచి నాకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ఇక తెలుగు రాకపోయినా అర్థం చేసుకుని సిద్ధార్థ్ మీనన్ బాగానే చేశాడు. ఇక ఎస్వీ కృష్ణారెడ్డి గారు ఎంత పెద్ద డైరెక్టర్ అనే విషయం అందరికీ తెలిసిందే. ఆయనకి యాక్షన్ చెప్పడానికి నేను టెన్షన్ పడ్డాను. ఈ సినిమాలో ఆయన చేసిన కీలకమైన పాత్ర చాలా బలమైనదిగా కనిపిస్తుంది. ఈ సినిమాకి మణిశర్మగారు అందించిన సంగీతం .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయేలా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
చిన్నప్పటి నుంచి కూడా కోడి రామకృష్ణ గారి సినిమాలు చూస్తూ పెరిగాను. అలాంటి ఆయన బ్యానర్లో సినిమా చేసే అకాశం రావడం ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా కోడి దివ్యగారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఇక ఈ మధ్య కాలంలో కిరణ్ అబ్బవరం గురించి కొంతమంది నెగెటివ్ గా ప్రచారం చేస్తున్నారు .. ఇష్టం వచ్చినట్టుగా కామెంట్స్ పెడుతున్నారు. కిరణ్ నాకు ఏడేళ్లుగా తెలుసు. షార్ట్ ఫిలిమ్స్ పని విషయంగా ఆయనను నన్ను కలిశాడు. అప్పటి నుంచి కలిసే ట్రావెల్ చేస్తున్నాము. ఒకరి గురించి ఒకరికి బాగా తెలుసు.
కిరణ్ ఎంతో కష్టపడి అంచలంచెలుగా ఎదుగుతూ వస్తున్నాడు. ఇప్పుడు ఆయన చేతిలో పది సినిమాలు ఉన్నాయి. ఆయన వరుసగా సినిమాలు చేయడం తప్పా .. కొత్త దర్శకులకు అవకాశాలు ఇవ్వడం తప్పా .. తన సినిమాల ద్వారా ఇతరులకు ఉపాధిని కల్పించడం తప్పా.
కిరణ్ పై అదే పనిగా కామెంట్స్ చేసే వాళ్లంతా స్టూడెంట్స్ అనే నేను అనుకుంటున్నాను. మీరంతా ఇలాంటి కామెంట్లతో కాలాన్ని వృథా చేయవద్దు .. మీ గోల్స్ పై దృష్టి పెట్టండి .. వాటిని సాధించడానికి కష్టపడండి. చివరిగా ఒక మాట .. ఈ సినిమాలో అన్ని రకాల షేడ్స్ ఉన్నాయి. మీ అందరికీ తప్ప కుండా నచ్చుతుందనే నమ్మకం ఉంది" అంటూ చెప్పుకొచ్చాడు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.