Begin typing your search above and press return to search.
శ్రీకాంత్ అడ్డాల.. మళ్లీ తన దారిలోనే!
By: Tupaki Desk | 1 July 2015 6:42 AM GMTసినిమాల ప్రభావం జనాల మీద విపరీతంగా ఉంటుంది కాబట్టి.. కొంచెం సామాజిక బాధ్యతతో సినిమాలు తీయాలి.. ఏదైనా మంచి చెప్పడానికి ట్రై చేయాలి అంటారు కొందరు దర్శకులు. ఇంకొందరేమో జనాలు సందేశాలు వినడానికి రారు, ఎంటర్టైన్మెంట్ కోసం వస్తారు.. కాబట్టి వాళ్లకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి తప్పితే సుద్దులు చెప్పకూడదు అంటారు. ఇక మూడో వర్గం దర్శకులుంటారు. వాళ్లు సందేశాలిస్తారు. మంచి విషయాలు చెబుతారు. కానీ అది ఎంటర్టైనింగ్‌గా చెబుతారు. సుగర్ కోటెడ్ అంటారే.. ఆ టైపులో అన్నమాట. ఈ కేటగిరీలో చేర్చదగ్గ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల.
తొలి సినిమా 'కొత్తబంగారు లోకం'లో టీనేజ్‌లో ఉన్న పిల్లలతో పెద్దలు ఎలా వ్యవహరించాలో చెప్పాడు.. రెండో సినిమా 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'లో డబ్బు కంటే గుణం గొప్పదని.. మనిషిని ప్రేమించమని చెప్పాడు.. మూడో సినిమా 'ముకుంద'లో సంకల్ప బలం గురించి చెప్పాడు.. ఇలా ప్రతి సినిమాలోనూ ఎంతో కొంత మంచి చెప్పడానికే ట్రై చేశాడు శ్రీకాంత్. దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీకాంత్‌కు మహేష్ బాబుతో మళ్లీ పని చేసే అవకాశం దక్కింది. వీళ్లిద్దరి కాంబినేషన్లో 'బ్రహ్మూెత్సవం' తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కూడా శ్రీకాంత్ విలువల పాఠం చెప్పబోతున్నట్లు సమాచారం. కథానాయకుడు తన చుట్టూ ఉన్న పాత్రల ద్వారా విలువల గురించి తెలుసుకోవడమే ఈ కథ అని చెబుతున్నారు. గతంలో ఇలాంటి సినిమాలు వచ్చినప్పటికీ.. శ్రీకాంత్ తనదైన శైలిలో టచ్ ఇస్తాడనడంలో సందేహం లేదు. ఏదేమైనా ఈ తరం డైరెక్టర్లలో సమాజం గురించి ఓ కన్సర్న్ ఉన్న దర్శకుడిగా శ్రీకాంత్‌ను చెప్పుకోవాలి.