Begin typing your search above and press return to search.
శ్రీకాంత్ అడ్డాల మళ్లీ రాశాడు
By: Tupaki Desk | 7 May 2016 11:30 AM GMTతొలి సినిమాతో ‘కొత్త బంగారు లోకం’తోనే తానొక విలక్షణమైన దర్శకుడినని రుజువు చేసుకున్నాడు శ్రీకాంత్ అడ్డాల. ఆ తర్వాత కూడా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.. ముకుంద.. లాంటి మంచి సినిమాలు అందించాడు. దర్శకుడిగానే కాక మాటల రచయితగానూ శ్రీకాంత్ టాలెంట్ ఏంటో అందరికీ తెలుసు. ఐతే అతడిలో ఓ లిరిసిస్ట్ కూడా ఉన్నాడన్న సంగతి చాలామందికి తెలియదు. ఇంతకుముందు తన తొలి సినిమా ‘కొత్త బంగారు లోకం’లో కళాశాలలో.. అంటూ సాగే పాటను రాసింది శ్రీకాంతే. ఇప్పుడు మరోసారి అతను గీత రచయితగా మారాడు. మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన కొత్త సినిమా ‘బ్రహ్మోత్సవం’లో శ్రీకాంత్ ఓ పాట రాయడం విశేషం.
ఆట పాటలాడు.. అంటూ సాగే పాటను శ్రీకాంత్ అడ్డాల రాశాడు. కార్తీక్ ఈ పాటను ఆలపించాడు. ‘బ్రహ్మోత్సవం’ ఆడియోలో మొత్తం ఏడు పాటలున్నాయి. ఇందులో రెండు పాటలు లెజెండరీ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామశాస్త్రి రాశారు. ఇప్పటికే ఆయన రాసిన ‘వచ్చింది కదా అశకాశం..’ అనే పాట లిరిక్స్ తో సహా రిలీజైంది. అందరినీ ఆకట్టుకుంది. దీంతో పాటు ఆయన బ్రహ్మోత్సవం టైటిల్ సాంగ్ కూడా రాశారు. మధురం మధురం అంటూ ప్రోమో రిలీజ్ చేసిన పాట.. నాయుడోరింటికాడ.. అనే పాట పాత లిరిక్స్. ఇక ‘రౌడీఫెలో’తో దర్శకుడిగా మారిన లిరిసిస్ట్ కృష్ణచైతన్య రెండు పాటలు రాశాడు. బాలా త్రిపురమణి.. పుట్ యువర్ హ్యాండ్స్ అప్ అనే పాటలు అతను రాశాడు. ‘బ్రహ్మోత్సవం’ ఆడియో ఈ రోజు రాత్రికే విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.